Telangana Election: ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం

ABN , First Publish Date - 2023-10-11T12:57:53+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఆయుధంలాంటి ఓటు జాబితాలో ఉందా లేదా? చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తుది జాబితాలో ఓటు లేక పోతే తిరిగి పొందే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి ఫారం 6 కింద కొత్త ఓటరు నమోదు, ఫారం 8 కింద ఇతర ప్రాంతాల నుంచి తమ ఓటు మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telangana Election: ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం

ఖమ్మం: ప్రజాస్వామ్యంలో ఆయుధంలాంటి ఓటు జాబితాలో ఉందా లేదా? చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తుది జాబితాలో ఓటు లేక పోతే తిరిగి పొందే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి ఫారం 6 కింద కొత్త ఓటరు నమోదు, ఫారం 8 కింద ఇతర ప్రాంతాల నుంచి తమ ఓటు మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో అక్టోబరు ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటుహక్కును కల్పించనున్నారు.


తాజాగా వెల్లడించిన ఓటర్ల జాబితాను ప్రతి నియోజకవర్గంలో, ప్రతీ పోలింగ్‌ కేంద్రంలోనూ ఓటరు జాబితా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు ఉందోలేదో ఒక సారి జాబితాలో సరిచూసుకోవాలంటూ సూచిస్తున్నారు. తహాసీల్దారు, మునిసిపల్‌ కమిషనర్‌, ఆర్డీవో, పంచాయతీ కార్యాలయాల్లో ఈ జాబితాలను అందుబాటులో ఉంచారు. అలాగే ఎన్నికల కమిషనర్‌ వెబ్‌సైట్‌ www.ceotelangana.nic.in-, ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు. అక్కడ అడిగిన విధంగా జిల్లా, నియోజకవర్గం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను పొందుపరిచి ఓటు ఉన్నదీ లేనిది తెలుసుకోవచ్చు.

Updated Date - 2023-10-11T12:57:53+05:30 IST