Health: వేగించిన శనగలు కాలక్షేపానికే కాదు...
ABN , First Publish Date - 2023-09-28T12:15:18+05:30 IST
బస్‌స్టాండ్‌లలో.. రైల్వే స్టేషన్లలో... పార్క్‌లలో- ఇలా ఎక్కడికి వెళ్లినా వేగించిన శనగలు దొరుకుతూ ఉంటాయి. అయితే చాలా మంది వీటిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఈ వేగించిన శనగలలో అనేక పోషకవిలువలు ఉన్నాయని.. చిప్స్ కన్నా ఇవి వెయ్యిరెట్లు మేలని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు.

నల్లశనగలలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్‌తో పాటుగా ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే- మన శరీరానికి అవసరమైన పౌష్టికాహారం లభిస్తుంది.
చాలా మంది వేగించిన శనగలు త్వరగా జీర్ణమవ్వవని అనుకుంటారు. కానీ వేగించిన శనగలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల త్వరగా అరుగుతుంది. అంతే కాకుండా వీటిని తింటే త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకొనేవారికి వేగించిన శనగలు మంచి ఆహారం.
వీటిలో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అంతే కాకుండా గుండెలో రక్తం గడ్డకట్టకుండా ఉపకరిస్తాయి.
వేగించిన శనగలలో స్టెరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా అడ్డుపడుతుంది.