After Food Yoga: సెలబ్రిటీలు ఫాలో అయ్యే ట్రిక్ ఇది.. భోజనం తరువాత ఈ ఒక్క పని చేస్తే..!
ABN , Publish Date - Dec 25 , 2023 | 02:11 PM
సెల్రిటీలను చూసినప్పుడల్లా వారి శరీర సౌష్టవం విషయంలో ఆశ్చర్యపోతుంటాం. ఏమైనా తింటారా లేదా అనే అనుమానం కూడా వస్తుంది. కానీ భోజనం తరువాత ఈ పని చేస్తే..
సెల్రిటీలను చూసినప్పుడల్లా వారి శరీర సౌష్టవం విషయంలో ఆశ్చర్యపోతుంటాం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది మరికాస్త ఎక్కువగానే ఉంటుంది. అసలు వారు ఏమైనా తింటారా? లేదా? అలా సన్నగా నాజూగ్గా ఎలా ఉంటారో అనే సందేహం కూడా వస్తుంది. సెలబ్రిటీలు కూడా తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కానీ తమ శరీరంలో కొవ్వు పెరగకుండా ఉండటానికి, ఆహారం జీర్ణం కావడానికి, ఇతర ఉదర సంబంధ సమస్యలు రాకుండా ఉండటానికి ఫిట్ నెస్ ట్రైనర్ సహాయం తీసుకుంటారు. అలియా భట్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అనన్య పాండే మొదలైన బాలీవుడ్ భామలకు ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేసిన అన్షుక పర్వాణి ఓ ట్రిక్ షేర్ చేశారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
సెలబ్రిటీలు తమ శరీర సౌష్టవం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒళ్లు పెరగకుండా ఉండటానికి ఫిట్నెస్ ట్రైనర్ల సహాయంతో ఎప్పటిప్పుడు కేలరీలను బర్న్ చేస్తుంటారు. ప్రముఖ సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేసిన అన్షుక పర్వాణి భోజనం తరువాత చేసే అద్బుతమైన యోగా ఆసనం గురించి ఇన్స్టాగ్రామ్ లో వివరించారు. బోజనం తరువాత వజ్రాసనం వేయడం వల్ల మంచి ఫలితాలుంటాయని అంటున్నారు.
ఇది కూడా చదవండి: శనగలు, బెల్లం.. ఈ సూపర్ కాంబినేషన్ తింటే కలిగే లాభాలివీ..!
మోకాళ్ళ మీద కూర్చుని పాదాల మడమల మీద పిరుదులు ఆనించి కూర్చోవడాన్ని వజ్రాసనం అని అంటారు. ఈ భంగిమలో కూర్చోవడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ప్రేగు ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా మహిళలలో ఋతుచక్రం, మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండటానికి ఈ ఆసనం సహాయపడుతుంది. భోజనం చేసిన తరువాత ఈ ఆసనం ఫాలో అయితే పై ప్రయోజనాలు చేకూరతాయి.
కేవలం వజ్రాసనం మాత్రమే కాకుండా వజ్రాసనంలో కూర్చున్నప్పుడు పోషణ ముద్ర వెయడం వల్ల మరిన్ని లాభాలుంటాయి. ఈ ముద్ర వేయడానికి కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు మూడింటిని కలిపి ఉంచాలి. ఎడమ చేతి బొటన వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు మూడింటిని కలిపి ఉంచాలి. చలికాలంలో ఆహారం చాలా నెమ్మదిగా ఉంటుంది. వజ్రాసనంలో కూర్చుని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేస్తే ఆహారం బాగా జీర్ణమవుతుంది. దీన్ని 3 నిమిషాలతో మొదలుపెట్టి 15 నిమిషాల వరకు ఎంతసేపు అయినా వేయవచ్చు.
ఇది కూడా చదవండి: Brain Health: ఆహారం కాదండోయ్.. ఈ నాలుగు పనులు చేస్తే చాలు.. మెదడు యమా యాక్టీవ్!
(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, ఫిట్ నెస్ ట్రైనర్లు పలు చోట్ల పేర్కొన్న అంశాల ఆదారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.