Banana Hair: అరటితో జుట్టు మిలమిల.. ఎలాగంటే..!
ABN , First Publish Date - 2023-06-19T11:42:08+05:30 IST
రెండు అరటిపండ్లు, రెండు అలొవెరా ఆకులను తీసుకుని వాటి తొక్కలను తీయాలి. అరటిపండ్లు, అలొవెరా ఆకుల్ని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ చేయాలి. దీన్ని కురుల మూలాలు
రెండు అరటిపండ్లు, రెండు అలొవెరా ఆకులను తీసుకుని వాటి తొక్కలను తీయాలి. అరటిపండ్లు, అలొవెరా ఆకుల్ని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ చేయాలి. దీన్ని కురుల మూలాలు తాకేట్లు పట్టించాలి. రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే జుట్టులో మెరుపు వస్తుంది. బలమైన జుట్టు మీ సొంతమవుతుంది.
రెండు అరటిపండ్లను మెత్తగా చేసి బౌల్‌లో వేయాలి. అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత క్లీన్ చేస్తే సరి.. కురుల పెరుగుదల కనిపిస్తుంది.
బౌల్‌లో రెండు అరటిపండ్ల చూర్ణం, సగం బొప్పాయి చూర్ణం, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలిపిన తర్వాత జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఊడిపోవటం తగ్గిపోతుంది.
ఒక అరటిపండు చూర్ణంలోకి వంద మి.లీ. పాలను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పట్టిస్తే మృదువుగా తయారవుతాయి.