Rainy season: వర్షాకాలంలో చర్మవ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే..!
ABN , First Publish Date - 2023-07-14T12:44:15+05:30 IST
వానాకాలంలో చర్మవ్యాధులు బారిన పడుతుంటారు. స్కిన్ ఎలర్జీలు, పగుళ్లు, దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో అందం కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
వానాకాలంలో చర్మవ్యాధులు బారిన పడుతుంటారు. స్కిన్ ఎలర్జీలు, పగుళ్లు, దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో అందం కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
వర్షాకాలంలో తడవటం వల్ల జుట్టు పాడవుతుంది. కుదుళ్లు దెబ్బతింటాయి. వాతావరణ కాలుష్యం వల్ల చినుకుల్లో ఇతర రసాయన పదార్థాలు కూడా ఉంటాయని మర్చిపోకూడదు. అందుకే వానల్లో తడవద్దు. పైగా కొబ్బరినూనెను పట్టించుకోవటం మర్చిపోరాదు. షాంప్‌తో వాష్ చేశాక కుదుళ్లు గట్టిగా ఉండటంతో పాటు ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
అలవెరా, అరటి, నిమ్మ, ఉసిరికాయ, కుంకుడు, సీకాయలతో జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుంది.
కొందరు వానాకాలం కదా.. అని తక్కువ నీళ్లు తాగుతారు. ఇది మంచిది కాదు. దప్పిక అయినప్పుడు కచ్చితంగా నీళ్లు తాగాల్సిందే.+ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తేమను తీసేయాలి. మందారం పూలు, మందారం ఆకుల రసం, నిమ్మ, అలవెరా లాంటి సహజమైన ఉత్పత్తులతో ఫేస్ మాస్క్ వేసుకోవాలి. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు, దదుర్లు రావు.
చర్మాన్ని చల్లబరిచేందుకు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయాలి.
వర్షాకాలం సింథటిక్, బిగుతైన దుస్తులను వాడకూడదు. దీనివల్ల దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ ఎ, సి ఉండే టమోటాను ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి. దీని వల్ల చర్మ కణాలు డ్యామేజ్ కావు. నల్లని మచ్చలు తొలగిపోతాయి. కొల్లాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఆపిల్, అరటి, దానిమ్మ తినాలి. తాజా పండ్లనే తినాలి. వేడివేడి ఆహారపదార్థాలనే తినాలి. ఫాస్ట్‌ఫుడ్ తినకూడదు. అల్లం టీ ప్రతిరోజూ తాగాలి. దీని వల్ల మూడ్ మారుతుంది. ముఖ్యంగా మాస్క్ విషయాని కొస్తే పసుపుతో మాస్క్ వేసుకోవటం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు తలెత్తవు.
మేకప్ వేసుకోకపోవటం మంచిది. ప్రతిరోజూ రెండు, మూడు సార్లు చర్మాన్ని శుభ్రపరచుకోవాలి.
వీలైనంత వరకూ గోరు వెచ్చని నీటిని తాగాలి. ముఖ్యంగా వార్షాకాలంలో చర్మం, జుట్టు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.