పసుపును ఇలా ఉపయోగిస్తే అందం మీ సొంతం!

ABN , First Publish Date - 2023-06-29T13:02:21+05:30 IST

బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ పసుపు, టీస్పూన్‌ తేనె, కొద్దిగా నీళ్లు కలిపి మిక్స్‌ చేసి ముఖానికి పట్టించాలి. ఫేస్‌ప్యాక్‌ ఆరిన తర్వాత కడిగివేయాలి. ఇలా చేస్తుంటే.. ముఖం మీద ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి.

పసుపును ఇలా ఉపయోగిస్తే అందం మీ సొంతం!

  • బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ పసుపు, టీస్పూన్‌ తేనె, కొద్దిగా నీళ్లు కలిపి మిక్స్‌ చేసి ముఖానికి పట్టించాలి. ఫేస్‌ప్యాక్‌ ఆరిన తర్వాత కడిగివేయాలి. ఇలా చేస్తుంటే.. ముఖం మీద ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి.

  • వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసుకుని చల్లార్చి తాగితే ఆరోగ్యానికి మంచిది. అలానే గోరువెచ్చని పాలల్లో కొద్దిగా పసుపు వేసి చర్మం మీద రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

  • మూడు టేబుల్‌ స్పూన్లు ఓట్స్‌ను మెత్తగా రుబ్బాలి. ఆ మిశ్రమంలోకి చిటికెడు పసుపు, తాజా నిమ్మరసం వేశాక మిక్స్‌ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే మచ్చలు తొలగిపోతాయి.

  • రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టీ స్పూన్‌ పసుపు మిశ్రమంగా కలపాలి. ఆయిలీ స్కిన్‌ వాళ్లయితే అరటీస్పూన్‌ తేనె వేయాలి. అదే పొడిచర్మం వారికి అయితే తేనెకు బదులు నిమ్మరసం వాడాలి. ఇలా చేస్తే ముఖంలో కాంతి వస్తుంది.

  • బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్లు అలవెరా జెల్‌ను, టీ స్పూన్‌ పసుపును మిశ్రమంగా కలపాలి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందువల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.

  • పసుపులోకి కొద్దిగా వేపనూనె వేసి మిక్స్‌ చేసి.. ఆ మిశ్రమాన్ని పట్టిస్తే ముఖం మీద దద్దుర్లు, నొప్పులు రావు.

  • పుదీనా పేస్ట్‌, పసుపును కలిపిన తర్వాత ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖం మీద ఉండే నొప్పులు తొలగిపోతాయి.

Updated Date - 2023-06-29T13:02:21+05:30 IST