Dandruff: చుండ్రు చురచురమంటోందా? ఈ జాగ్రత్తలతో బయటపడొచ్చు!

ABN , First Publish Date - 2023-07-10T12:51:27+05:30 IST

చుండ్రు పెట్టే దురద ఇబ్బంది పడే వాళ్లకే తెలుస్తుంది. దురద పెట్టిన ప్రతిసారీ తలను వేళ్లతో గీరుకోవడం ఎవరికైనా నామోషీగానే ఉంటుంది. ఈ ఇబ్బంది వానాకాలంలో ఇంకాస్త పెరుగుతుంది. కాబట్టి వానాకాలంలో చుండ్రును చీల్చి చెండాడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

Dandruff: చుండ్రు చురచురమంటోందా? ఈ జాగ్రత్తలతో బయటపడొచ్చు!

చుండ్రు పెట్టే దురద ఇబ్బంది పడే వాళ్లకే తెలుస్తుంది. దురద పెట్టిన ప్రతిసారీ తలను వేళ్లతో గీరుకోవడం ఎవరికైనా నామోషీగానే ఉంటుంది. ఈ ఇబ్బంది వానాకాలంలో ఇంకాస్త పెరుగుతుంది. కాబట్టి వానాకాలంలో చుండ్రును చీల్చి చెండాడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

కుదుళ్లు కులాసాగా..

చుండ్రుకు ప్రధాన కారణం కుదుళ్ల అపరిశుభ్రత. ఈ కాలంలో తలస్నానం మీద రెట్టింపు దృష్టి పెట్టాలి. ప్రతి రెండు రోజులకోసారి, కెటోకొనజోల్‌, జింక్‌ పైరిథియాన్‌ లేదా సెలీనియం సల్ఫైడ్‌ ఉన్న మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఈ పదార్థాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగ్‌సను నియంత్రించి, తలలో పొట్టు పెరగకుండా అడ్డుకుంటాయి. ఈ షాంపూను కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దించి, గోరువెచ్చని నీళ్లతో వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి. తలస్నానానికి ఎక్కువ వేడిగా ఉండే నీళ్లను వాడితే సహజ నూనెలు హరించి, జుట్టు పొడిబారుతుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లనే వాడుకోవాలి.

స్కాల్ప్‌ పొడిగా....

వాతావరణంలోని తేమ వల్ల వెంట్రుకలు తడిగా మారతాయి. స్కాల్ప్‌ కూడా తేమగా మారి చుండ్రుకు అనువుగా తయారవుతుంది. కాబట్టి స్కాల్ప్‌ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తల స్నానం తర్వాత, టవల్‌తో వెంట్రుకలను మృదువుగా అద్దుకుని, తేమను తొలగించాలి. గట్టిగా, మొరటుగా రుద్దుకోకూడదు. ఇలా చేస్తే స్కాల్ప్‌ ఇరిటేట్‌ అవుతుంది. అలాగే తడి జుట్టును ముడి వేసుకోవడం మంచి అలవాటు కాదు. ఇలా చేస్తే ఫంగ్‌సకు చేతులారా ఆహ్వానం పలికినట్టే!

నూనె మర్దన

ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ కోసం క్రమం తప్పకుండా జుట్టును నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలి. యాంటీ ఫంగల్‌ గుణాలు కలిగిన టీ ట్రీ ఆయిల్‌, వేప నూనె, కొబ్బరి నూనెల్లో కొన్ని చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ కలిపి, ఈ నూనెతో స్కాల్ప్‌ మర్దన చేసుకోవాలి. ఈ నూనెలతో జుట్టు మాయిశ్చరైజ్‌ అవడంతో పాటు చుండ్రుకు కారణమయ్యే ఫంగ్‌సను దూరమవుతాయి. ఇందుకోసం నూనెను కొద్దిగా వేడిచేసి, ముని వేళ్లతో జుట్టు కుదుళ్లకు మర్దన చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి.

పొగడ్తల రారాజు

ఒక అడవిలో సింహం ఉండేది. రాజుగారు కావటం వల్ల గట్టి పట్టుదలతో ఉండేది. అహంకారం ఉండేది. పైగా కోపమెక్కువ. ఎవరి మాటా వినేది కాదు. సలహాలు ఇష్టపడేది కాదు. అసలు అడవిని పట్టించుకునేది కాదు. దీంతో జంతువులు అన్నీ అసంతృప్తితో ఉండేవి. పైగా కొందరు వేటగాళ్లు అడవిని ఒకవైపు నాశనం చేసుకుంటూ వస్తున్నారు. చెట్లన్నీ కొట్టేస్తున్నారు. దీంతో అడవి లోపలికి జంతువులన్నీ పారిపోయేవి. వీలైతే రాత్రిపూట ఇతర అడవుల్లోకి పారిపోతూ.. వేటగాళ్ల బారినపడి చనిపోయేవి. అయితే ఇలాంటి విషయాలు చెప్పకుండా కోతి మంత్రి ఉండేది.

రాజుగారికి సలహా ఇస్తే ఏమంటాడో అని మంత్రి అనుకునేది. దీనికి తోడు జింక, ఎలుగుబంటి, చిలుకలు.. ఇలా అన్నీ ఆ రాజుగారికి భజన చేసేవి. ఆ భజనకు అలవాటు పడింది రాజు. తన బాధ్యతను మరిచి గుహలోనే సంతోషంగా సేదతీరుతూ.. తనను పొగిడించుకుంటూ సింహం ఉండేది. అనుకోకుండా దూరం నుంచి ఆ అడవిలోకి ఓ గుంట నక్క వచ్చింది. అది తెలివైనది. అడవిలో ఒక్క నక్క కూడా లేకపోవటంతో అన్ని జంతువులు విచిత్రంగా చూశాయి. రాజుగారిని కలవాలని నక్క అన్నది. మంత్రిగారు తీసుకెళ్లారు. నక్క ఇలా అన్నది.. ‘అయ్యా.. మీరు భజనకు అలవాటు పడ్డారు’ అన్నది. అందరూ ఆశ్చర్యపోయారు. ‘రాజుగారిని ఏమైనా అంటే.. నీకు ఏమవుతుందో తెలుసా’ అన్నది ఓ జింక. ‘ప్రాణాలు పోతాయిలే’ అన్నది నక్క. ‘అంత అహంకారమా?’ అంటూ సింహం గర్జించింది. ‘నన్ను తినేసెయ్‌. పర్వాలేదు. ఈ అడవి నాశనం అవుతోంటే.. ఈ భజనలకు అలవాటు పడి నిద్రపోతూ ఉన్నావే. ఇది ఏమాత్రం మంచిది కాదు’ అన్నది నక్క. క్షణం పాటు రాజుగారు ఆలోచించారు. మంత్రిగారిని అడిగి విషయం తెలుసుకున్నారు. తన పొరబాటును తెలుసుకున్నది సింహం. అప్పటినుంచి సింహగర్జన చేసింది. వేటగాళ్లు అటువైపు రాలేదు. అడవి మళ్లీ మొక్కలతో కళకళలాడింది.

Updated Date - 2023-07-10T12:51:27+05:30 IST