Depression: డిప్రెషన్ తగ్గాలంటే ఇలా చేయండి!
ABN , First Publish Date - 2023-08-03T13:00:38+05:30 IST
ప్రతి రోజూ తినే ఆహారం మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. సరైన పౌష్టికాహారం తింటే శరీరానికి అనారోగ్యం రాకపోవటమే కాకుండా డిప్రషన్ వంటి సమస్యలు లేకుండా మానసికంగా కూడా బలంగా ఉంటాం. ఇలా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం..
ప్రతి రోజూ తినే ఆహారం మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. సరైన పౌష్టికాహారం తింటే శరీరానికి అనారోగ్యం రాకపోవటమే కాకుండా డిప్రషన్ వంటి సమస్యలు లేకుండా మానసికంగా కూడా బలంగా ఉంటాం. ఇలా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం..
జంక్ ఫుడ్
జంక్‌ఫుడ్‌లో రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా పెరుగుతుంది. అందువల్ల జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానివేయమని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
పౌష్టికాహారం తప్పనిసరి..
మనకు సమస్యలను కలగజేసే జంక్‌ఫుడ్‌ను వదిలించుకోవటంతో పాటుగా- పౌష్టికాహారాన్ని తినటం కూడా చాలా ముఖ్యమైన అంశం. మన మెదడులో రసాయన సంకేతాలను పంపే న్యూరోట్రాన్స్‌మీటర్స్ ఉత్పత్తిలో అమీనో యాసిడ్స్ కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ అమీనోయాసిడ్స్ ద్వారానే ప్రొటీన్ తయారు అవుతుంది. అంటే మన మానసిక ఆరోగ్యం బాగా ఉండాలంటే ప్రతి రోజు తగినంత ప్రొటీన్ తీసుకోవాలి. మన మానసిక ఆరోగ్యం బావుండటంలో బీ6, బీ12 చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి సరిపోయినంత ఉన్నప్పుడు న్యూరోట్రాన్స్‌మీటర్స్ సమర్ధంగా పనిచేస్తాయి. అందువల్ల మెదడు కూడా సక్రమంగా పనిచేస్తుంది.
విటమిన్-డి
మన మెదడు ఆరోగ్యానికి విటమిన్-డి చాలా కీలకం. విటమిన్-డి తక్కువగా ఉంటే డిప్రషన్ వంటి మానసిక సమస్యలు బాగా పెరుగుతాయి. అందువల్ల విటమిన్-డి స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి.
మెగ్నిషియం
మన శరీరంలో 300 రకాల బయోకెమికల్ రియాక్షన్స్ జరగటంలో మెగ్నిషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యం బావుండాలంటే మెగ్నిషియం విలువలు సరిపోయినంతగా ఉండాలి.
ప్రొబయాటిక్స్
పెరుగులో ఎక్కువగా ప్రొబయాటిక్స్ ఉంటాయి. దీనిని తినటం మన పేవులలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బ్యాక్టీరియా మన ఆందోళనను తగ్గించటంలో కూడా ఎంతో ఉపకరిస్తుంది.
ఒమెగా 3 ఫ్యాట్స్
చేపల్లో ఎక్కువగా లభించే ఒమెగా 3 ఫ్యాట్స్ మన మెదడు ఆరోగ్యంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మెదడులో ఎక్కడైనా వాపు ఉన్నా.. దానిని తగ్గించటంలో వీటిది పాత్ర ప్రధానమైంది.