Hot water bath: ఆ సమస్య ఉన్న వారు వేడి నీళ్ల స్నానం చేయకూడదు

ABN , First Publish Date - 2023-08-24T11:55:58+05:30 IST

మన శరీరానికి అవసరమైన ద్రవాలను తగినంత తీసుకోకపోతే రకరకాల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. మనం తగినన్ని ద్రవాలు తీసుకోవటం లేదనే విషయాన్ని కొన్ని లక్షణాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం..

Hot water bath: ఆ సమస్య ఉన్న వారు వేడి నీళ్ల స్నానం చేయకూడదు

మన శరీరానికి అవసరమైన ద్రవాలను తగినంత తీసుకోకపోతే రకరకాల ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. మనం తగినన్ని ద్రవాలు తీసుకోవటం లేదనే విషయాన్ని కొన్ని లక్షణాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం..

  • చర్మం పొడిబారుతుంది. ముడతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చర్మం కాంతివంతంగా ఉండదు. పాలిపోయినట్లు కనిపిస్తుంది. చిన్న చిన్న గాయాలకు ఎక్కువగా రక్తం వస్తూ ఉంటుంది. దురదగా ఉంటుంది.

  • పెదాలు పగిలిపోతాయి. పాలిపోతాయి. పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ పగుళ్లు కూడా త్వరగా మానవు. అప్పుడప్పుడు రక్తం వస్తూ ఉంటుంది.

ఎలా రక్షించుకోవాలి?

  • ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి. పనుల్లో బాగా బిజీగా ఉండేవారు- రిమైండర్స్‌ పెట్టుకోవటం మంచిది.

  • నీటి శాతం ఎక్కువగా ఉన్న పళ్లను, కూరగాయాలను తినాలి. ఇదే విధంగా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచే అవకాడోలు, రకరకాల డ్రైఫ్రూట్స్‌ను తినాలి.

  • హైలూరోనిక్‌ యాసిడ్‌, గ్లిజరిన్‌ ఎక్కువగా ఉన్న చర్మ సౌందర్య సాధనాలను వాడితే తేమ ఎక్కువ సేపు ఉంటుంది. పెదాలకు కొబ్బరినూనె లేదా నెయ్యి రాయాలి.

  • వేడినీళ్లుతో ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు. రసాయనాలు ఎక్కువగా ఉన్న సబ్బులను వాడకూడదు.

  • ఎండలో ఎక్కువ సేపు తిరగకూడదు. ఒక వేళ ఎండలోకి వెళ్లాల్సి వస్తే- వేడి తగలకుండా బట్టలు వేసుకు వెళ్లాలి.

  • కాఫీ, ఆల్కాహాల్‌ ఎక్కువగా తాగకూడదు. ఒక వేళ ఈ అలవాటు ఉంటే- అవసరమైనదాని కన్నా ఎక్కువ నీటిని తాగాలి.

Updated Date - 2023-08-24T11:55:58+05:30 IST