Skin: చర్మం నిగనిగలాడాలంటే..!

ABN , First Publish Date - 2023-06-15T13:55:48+05:30 IST

మన శరీరంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రొటీన్‌లలో కోలోజిన్‌ అతి ముఖ్యమైనది. ఇది కేవలం మన చర్మానికి మాత్రమే కాకుండా కండరాల ఆరోగ్యానికి కూడా

Skin: చర్మం నిగనిగలాడాలంటే..!
Skin

మన శరీరంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రొటీన్‌లలో కోలోజిన్‌ అతి ముఖ్యమైనది. ఇది కేవలం మన చర్మానికి మాత్రమే కాకుండా కండరాల ఆరోగ్యానికి కూడా అత్యంత ముఖ్యమైనది. కొలోజిన్‌ తగినంత ఉత్పత్తి అయితే- చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ కొలోజిన్‌ ఎక్కువగా ఉత్పత్తి కావటానికి నిపుణులు కొన్ని మార్గాలు సూచిస్తున్నారు.

విటమిన్‌ సి

విటమిన్‌ సిని ఎక్కువగా తీసుకుంటే కోలోజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్‌ సి- పుల్లటి పళ్లు, పచ్చటి ఆకుకూరలు, గుడ్లలో ఎక్కువగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కోలోజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

కలబంద

కలబందను చర్మంపై రాసినప్పుడు అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో చర్మకణాలకు కోలోజిన్‌కు మధ్య ఉండే సంబంధాన్ని పెంపొందించటం ఒకటి. అందువల్ల కలబందను ప్రతి రోజు చర్మానికి రాయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

క్రీములు కూడా..

చర్మ సౌందర్యాన్ని పెంపొందించే ఉత్పత్తులు మనకు మార్కెట్‌లో అనేకం లభ్యమవుతున్నాయి. విటమిన్‌ ఏ, అమినో యాసిడ్స్‌ ఉన్న ఉత్పత్తులను వాడటం వల్ల కోలోజిన్‌ సమతుల్యత సాధ్యమవుతుంది.

Updated Date - 2023-06-15T13:55:48+05:30 IST