Food: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి
ABN , First Publish Date - 2023-08-24T12:43:50+05:30 IST
ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో జీర్ణ సమస్యలు ఎదురుకావటం అతి సామాన్యమైన విషయం. ఈ సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక చిట్కా పళ్లు తినటం. ఆ పళ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో జీర్ణ సమస్యలు ఎదురుకావటం అతి సామాన్యమైన విషయం. ఈ సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక చిట్కా పళ్లు తినటం. ఆ పళ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యాపిల్స్: యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది అజీర్తికి.. విరోచనాలకు మంచి మందు. అంతే కాకుండా ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
అరిటిపళ్లు: కడుపులో ఉండే ఒక విధమైన చెడు బ్యాక్టీరియా అల్సర్స్‌ను కలగజేస్తాయి. ఈ అల్సర్స్‌ను నివారించటానికి అరిటిపళ్లు ఉపయోగపడతాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి.
కివి: కివీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా ఎక్టినిడిన్ అనే ఒక ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో ప్రొటీన్ త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
అప్రీకాట్: అప్రీకాట్‌లలో విటమిన్ సి ఉంటుంది. అంతే కాకుండా దీనిలో ఉండే ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది.