Stiffness of Muscles: కండరాలు, ఎముకలు దృఢంగా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-06-14T12:24:39+05:30 IST

ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలనుకుంటారు. వ్యాయామాలతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. కండరాలు, ఎముకల గట్టితనం ఉండాలంటే.. ఇలాంటి ఆహారాన్ని

Stiffness of Muscles: కండరాలు, ఎముకలు దృఢంగా ఉండాలంటే..!
FOOD

ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలనుకుంటారు. వ్యాయామాలతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. కండరాలు, ఎముకల గట్టితనం ఉండాలంటే.. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..

  • మాంసాహారం తినటం వల్ల కండరాల్లో బలం వస్తుంది. వీటితో పాటు ప్రతి రోజూ ఒక కోడిగుడ్డు తిన్నా.. మజిల్‌ పవర్‌ పెరుగుతుంది. ఇక పాల ఉత్పత్తులు ఏవి తీసుకున్నా కండబలం పెరుగుతుంది.

  • బీన్స్‌ తినాలి. ఇక సాల్మన్‌ లాంటి చేపలను తింటే కండరాల పుష్టి కలుగుతుంది.

  • ఎముకలు గట్టిపడాలంటే కాల్షియంతో పాటు విటమిన్‌- డి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలు తప్పని సరి. కాల్షియం శాతం అధికంగా ఉంటుంది. ఇక పెరుగులో ముప్ఫయిశాతం కాల్షియం ఉంటుంది. అందుకే పెరుగుతో చేసిన ఆహారం తీసుకోవాలి

  • కొత్తిమీర, నారింజ రసంలో కూడా కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా చేపలు తింటే కాల్షియంతో పాటు డి-విటమిన్‌ లభిస్తుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.

  • బ్రొకోలి, గింజలు.. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పిస్తాలను తీసుకున్నా కాల్షియం, డి-విటమిన్‌ అధికంగా ఉండటం వల్ల ఎముకల్లో బలం వస్తుంది.

  • విటమిన్‌ సి, పాస్ఫరస్‌ ఉండే అరటిపండ్లు తింటే తక్షణమే శక్తి వస్తుంది. ఇక ముఖ్యంగా అరటిపండ్లు ఎముకల గట్టితనానికి ఉపయోగపడతాయి. ఎలా అంటే.. ఇందులో ఉండే బి-6 విటమిన్‌ వల్ల ఎముకల స్ర్టెంగ్స్‌కు ఉపయోగపడే ఎంజైమ్స్‌ విడుదలవుతాయి.

  • కండరాలు గట్టిపడాలని, ఎముకలు దృఢంగా ఉండాలని కేవలం ఆహారం మాత్రమే తింటే బరువు పెరుగుతారు. అందుకే వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. దీంతో పాటు కంటికి నిద్ర ఉండాలి. అప్పుడే ఆహారం వల్ల ఉపయోగం ఉంటుంది.

Updated Date - 2023-06-14T12:24:39+05:30 IST