Beauty: రెట్టింపు అందం మీ సొంతమవ్వాలంటే..!
ABN , First Publish Date - 2023-07-05T12:29:09+05:30 IST
వంపు తిరిగి ఒత్తుగా పెరిగిన కనురెప్పల కళ్లకు రెట్టింపు అందాన్ని సమకూరుస్తాయి. కాబట్టి పలుచగా ఉండే కనురెప్పలు ఒత్తుగా మారడం కోసం ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.
వంపు తిరిగి ఒత్తుగా పెరిగిన కనురెప్పల కళ్లకు రెట్టింపు అందాన్ని సమకూరుస్తాయి. కాబట్టి పలుచగా ఉండే కనురెప్పలు ఒత్తుగా మారడం కోసం ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.
రాత్రి నిద్రకు ముందు తాజా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం తీసుకుని, దాన్లో ఇయర్ బడ్ ముంచి కనురెప్పల మీద అద్దుకోవాలి. ఇలా వారం పాటు క్రమం తప్పక చేస్తే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.
నిమ్మ తొక్కును ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంలో వేసి, ఒక వారం తర్వాత ఆ నూనెను కనురెప్పలకు పూసుకున్నా ఫలితం ఉంటుంది.
పెట్రోలియం జెల్లీలో మస్కారా బ్రష్ ముంచి, దాంతో కనురెప్పలు అద్దుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే ఫలితం దక్కుతుంది.
చల్లారిన గ్రీన్ టీలో దూదిని ముంచి కనురెప్పల మీద అద్దుకోవాలి.
మూసిన కళ్లను మునివేళ్లతో సున్నితంగా మర్దన చేసుకున్నా, రక్తప్రసరణ పెరిగి కనురెప్పలు పెరుగుతాయి.
కనురెప్పలను ట్రిమ్ చేసుకున్నా, కుదుళ్లు ప్రేరేపితమై కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి
కనురెప్పలను వంపు తిప్పే ఐల్యాష్ కర్లర్ల వాడకం మానేయాలి. కనురెప్పలకు పెరిగే వీలు కల్పించాలంటే కర్లర్ల వాడకానికి బ్రేక్ ఇవ్వాలి.