Monsoon care: ఇలాంటి రోగాలు ఉన్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..!

ABN , First Publish Date - 2023-07-03T12:09:54+05:30 IST

ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని అందించే వర్షాకాలంలో అప్రమత్తంగా లేకపోతే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. గాలిలోని అధిక తేమ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.

Monsoon care: ఇలాంటి రోగాలు ఉన్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..!

ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని అందించే వర్షాకాలంలో అప్రమత్తంగా లేకపోతే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. గాలిలోని అధిక తేమ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి వేర్వేరు కారణాలుంటాయి. అత్యధిక ఫంగల్‌ సాంద్రతతో కూడిన వాతావరణం, న్యూట్రోపీనియా (తక్కువ మోతాదుల్లోని న్యూట్రోఫిల్స్‌), తేమ, తడితో కూడిన వాతావరణం, సింథటిక్‌ దుస్తులు ధరించడం, విపరీతమైన చమట లాంటివి సాధారణ కారణాలు. అయితే హెచ్‌ఐవి, కీమోథెరపీ తీసుకుంటున్నా రోగులు, దీర్ఘకాలం పాటు సిస్టమిక్‌ యాంటిబయాటిక్స్‌ వాడుతున్నవాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా ఈ కాలంలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. అవేంటంటే....

స్నానం తర్వాత: చర్మపు ముడతల్లో ఇరుక్కున్న తేమ, తడిలు ఫంగస్‌ పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే చర్మపు ముడతల్లో సైతం ఎక్కడా తడి లేకుండా పొడిగా తుడుచుకోవాలి.

వదులైన దుస్తులు: వేసవిలో మాదిరిగానే ఈ కాలంలో కూడా వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం ఉత్తమం.

వర్కవుట్‌ తర్వాత: చాలా మంది కార్డియో వర్కవుట్‌ తర్వాత రిలాక్స్‌ అయిపోతూ ఉంటారు. కానీ వర్కవుట్‌ పూర్తయిన వెంటనే స్నానం చేసి పొడి దుస్తులు వేసుకోవాలి. ఒంటి మీద చమట ఆరే వరకూ ఆలస్యం చేయకూడదు.

టవల్స్‌ ఇలా: ఫంగస్‌ పెరగకుండా ఉండాలంటే, టవల్స్‌ ప్రతి రోజూ ఉతికి, ఆరిన తర్వాత ఐరన్‌ చేస్తూ ఉండాలి. ఉతకడానికీ, ఆరిపోవడానికీ తేలికగా ఉండే కాటన్‌ టవల్స్‌ ఉపయోగించాలి.

లోదుస్తులు ఇలా: లోదుస్తుల్లోని లైనింగ్స్‌ ఫంగస్‌ పెరుగుదలకు అనుకూలమైన ప్రదేశాలు. కాబట్టి ఆ ప్రదేశాల్లో తేమ లేకుండా చూసుకోవాలి. వీలైతే వాటిని కూడా ఐరన్‌ చేసుకోవాలి.

స్టిరాయిడ్‌ క్రీమ్స్‌: ఒకవేళ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకితే, దాని మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టిరాయిడ్‌ క్రీమ్స్‌ అప్లై చేయకూడదు. ఇలా చేయడం వల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది. కాబట్టి వైద్యులను కలిసి సరైన చికిత్స తీసుకోవాలి.

Updated Date - 2023-07-03T12:09:54+05:30 IST