Beauty: వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే..!
ABN , First Publish Date - 2023-10-11T11:41:06+05:30 IST
వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తోడ్పడే హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తూ ఉండాలి. వీటిని ఇంట్లోనే తయారుచేసుకునే వీలుంది. శిరోజాల సౌందర్యానికి తోడ్పడే ఆ మాస్క్‌లు ఇవే!
వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తోడ్పడే హెయిర్ మాస్క్‌లను ఉపయోగిస్తూ ఉండాలి. వీటిని ఇంట్లోనే తయారుచేసుకునే వీలుంది. శిరోజాల సౌందర్యానికి తోడ్పడే ఆ మాస్క్‌లు ఇవే!
పొడిజుట్టు కోసం
ఐదు చెంచాల సెనగపిండి, పెరుగు, రెండు పెద్ద చెంచాల ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పట్టించాలి.
20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి.
కండిషనర్ వాడడం మర్చిపోకూడదు.
సెనగపిండి కుదుళ్లను బలపరిస్తే, ఆలివ్ ఆయిల్, పెరుగు జుట్టుకు మెరుపును అందిస్తాయి. జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా తయారవుతుంది.
సాధారణ వెంట్రుకలు
రెండు పెద్ద చెంచాల సెనగపిండి, బాదం పొడిలను గిన్నెలో కలుపుకోవాలి.
దీనికి కొంత పెరుగు కూడా కలుపుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని కదుళ్లు, వెంట్రుకలకు పట్టించాలి.
30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి.
జిడ్డు వెంట్రుకలు
రెండు పెద్ద చెంచాల సెనగపిండి, మెంతులు, కొబ్బరిపాలలో నానబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి.
అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి.
పాడయిన వెంట్రుకలు
ఒక మగ్గిన అరటిపండును గుజ్జుగా చేసుకోవాలి.
దీన్లో నాలుగు చెంచాల కొబ్బరినూనె, ఒక చెంచా గ్లిజరిన్, రెండు చెంచాల తేనె చేర్చి కలపాలి.
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి.
ఇలా వారానికి ఒకసారి చొప్పున క్రమం తప్పకుండా రెండు నెలలపాటు చేస్తే పాడయిన వెంట్రుకలు బాగవుతాయి.
జీవం కోల్పోయిన వెంట్రుకలు
కలబంద గుజ్జు రెండు పెద్ద చెంచాలు తీసుకోవాలి.
దీనికి రెండు పెద్ద చెంచాల సిలికాన్ లేని కండిషనర్‌ను కలపాలి.
ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పూసుకుని, పెద్ద దంతాలు ఉన్న దువ్వెనతో వెంట్రుకలు అన్నింటికీ అంటుకునేలా దువ్వాలి.
20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి.