Spice: వీటి విలువ తెలియకుండానే వాడేస్తున్నారా?
ABN , First Publish Date - 2023-04-04T14:01:13+05:30 IST
జీలకర్ర, దాల్చినచెక్క లాంటి వాటిని వంటకాల్లో వాడుకుంటూ ఉంటాం. కానీ వాటిలోని ఆరోగ్య విలువల గురించి మనకు అంతగా
జీలకర్ర, దాల్చినచెక్క లాంటి వాటిని వంటకాల్లో వాడుకుంటూ ఉంటాం. కానీ వాటిలోని ఆరోగ్య విలువల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. మసాలా దినుసులు(Spice) అందించే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఏవంటే....
నల్ల మిరియాలు: జీర్ణ సంబంధ సమస్యలకు నల్ల మిరియాలు చక్కని విరుగుడు. వీటిలో ఉండే పెపరీన్ కొవ్వును కరిగిస్తుంది. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా నియంత్రిస్తుంది.
జీలకర్ర: వీటిత మొలల సమస్య తగ్గుతుంది. మతిమరుపు, నిద్రలేమి, రక్తహీనతలు కూడా తొలగిపోతాయి. భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత జీలకర్రను తినడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
అల్లం: అల్లానికి కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి పరగడుపున వేడి నీళ్లతో అల్లం రసం కలిపి తీసుకుంటే స్థూలకాయం రాకుండా ఉంటుంది.
పసుపు: దీన్లోని కర్‌క్యుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది.