Health: మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

ABN , First Publish Date - 2023-07-08T12:24:21+05:30 IST

మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిల్లో పొటాషియం, ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌, ఫైబర్‌, రైబోప్లేవిస్‌, ప్రోటీన్‌, విటమిన్‌ బి6, థయమిన్‌ వంటి ఎన్నోపోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు.

Health: మొలకెత్తిన గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటిల్లో పొటాషియం, ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌, ఫైబర్‌, రైబోప్లేవిస్‌, ప్రోటీన్‌, విటమిన్‌ బి6, థయమిన్‌ వంటి ఎన్నోపోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు. నాణ్యమైన గింజలను సేకరించి వాటిని మొలకెత్తించి తీసుకోవాలని చెబుతున్నారు.

  • మొలకెత్తించిన గింజలను తీసుకోవడం వల్ల శరీరం బలంగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

  • శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.

  • మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణాశయంలో కదలికలు పెరుగుతాయి.

  • పెద్ద పేగు కేన్సర్‌ బారిన పడకుండా ఉంటారు.

  • బరువు తగ్గాలనుకునే వారు మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

  • వీటిని తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చు.

  • శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడంతో పాటు త్వరగా ఆకలి వేస్తుంది.

  • మొలకెత్తిన గింజల్లో చాలా తక్కువ మోతాదులు క్యాలరీలు ఉంటాయి.

  • మొలకెత్తిన గింజలల్లోని సీ మిటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

  • ఇన్ఫెక్షన్స్‌తో పాటు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

  • మొలకెత్తిన గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి.

  • ఇవి శరీరంలో చెరువు కొలెస్ర్టాల్‌ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ర్టాల్‌ స్థాయిలు పెంచుతాయి

హైదరాబాద్, గచ్చిబౌలి, జూలై 7(ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-07-08T12:24:21+05:30 IST