Noodles: చిటికెలో ఆకలి తీరింది అనుకుంటున్నారా!? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే!
ABN , First Publish Date - 2023-06-28T12:40:50+05:30 IST
చిటికెలో వండుకుని తినేయొచ్చు కాబట్టి, ఇన్‌స్టంట్ నూడుల్స్ మీద ఎక్కువ మందికి మక్కువ ఎక్కువ. కానీ ఇవి చిటికెలో ఆకలిని తీర్చగలగడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చిటికెలో కుదేలు చేసే గుణాలను కలిగి ఉంటాయి.
చిటికెలో వండుకుని తినేయొచ్చు కాబట్టి, ఇన్‌స్టంట్ నూడుల్స్ మీద ఎక్కువ మందికి మక్కువ ఎక్కువ. కానీ ఇవి చిటికెలో ఆకలిని తీర్చగలగడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చిటికెలో కుదేలు చేసే గుణాలను కలిగి ఉంటాయి.
• ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ ఎ, సి, బి12, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి విలువైన పోషకాలేవీ ఉండవు. ప్యాకేజ్‌డ్ నూడుల్స్‌లో యాంటీఆక్సిడెంట్లతో పాటు, మన ఆరోగ్యానికి తోడ్పడే ఫైటోకెమికల్స్ కూడా ఉండవు. మరి ఏ పోషకాలూ లేని నూడుల్స్‌తో ఆకలి తీర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది?
• ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో గోధుమ పిండి, వెజిటబుల్ ఆయిల్, పొటాషియం అయొడైడ్, క్యారమెల్ కలర్, మాల్టోడెక్స్‌ట్రిన్ (షుగర్), మోనోసోడియం గ్లూటామేట్, టెర్షియరీ బ్యుటైల్‌హైడ్రోక్వినైన్ ఉంటాయి. వీటితో శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలేవీ అందవు.
• నిజానికి చిటికెలో వండుకోదగిన స్నాక్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. అటుకులు, ఫ్రైడ్ మఖ్‌నా లాంటి సింపుల్ స్నాక్స్‌తో ఆరోగ్యం క్షేమంగా ఉండడంతో పాటు పోషకాలు కూడా అందుతాయి. కాబట్టి ఎంతో అరుదుగా, అత్యవసర సమయాలకే నూడుల్స్‌ను పరిమితం చేసి ఇంటి వంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి.