అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? ఒక్కసారి చామంతి టీ తాగి చూడండి!

ABN , First Publish Date - 2023-07-04T13:00:52+05:30 IST

నీడలో ఎండబెట్టిన చామంతి పూలను నీళ్లలో మరిగించి, తేనె కలుపుకుంటే, చామంతి ‘టీ’ తయారైనట్టే! ఈ టీ తాగితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటంటే....

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? ఒక్కసారి చామంతి టీ తాగి చూడండి!

నీడలో ఎండబెట్టిన చామంతి పూలను నీళ్లలో మరిగించి, తేనె కలుపుకుంటే, చామంతి ‘టీ’ తయారైనట్టే! ఈ టీ తాగితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటంటే....

వందేళ్లకు ముందు నుంచి చైనాలో చామంతి టీ తాగే సంప్రదాయం ఉంది. ఈ టీ ఆందోళనను తగ్గించడంతో పాటు, అధిక రక్తపోటును అదుపులోకి తెస్తుంది. దీన్లో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు, మినరల్స్‌ ఒత్తిడిని క్రమబద్ధీకరించడంలో శరీరానికి సహాయపడతాయి. అలాగే ఈ టీతో వ్యాధినిరోధకశక్తి కూడా బలపడుతుంది. ఈ టీలో ఫినోలిక్‌ కాంపౌండ్లు, ఫ్లేవనాయిడ్స్‌, బీటేన్‌, కోలీన్‌, విటమిన్‌ బి1లు అలసటను తొలగించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. అలాగే ఈ టీతో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది. అలాగే ఎముకలు గుల్లబారే ఆస్టియొపొరొసిస్‌, ఇతరత్రా ఎముకల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే ఈ ఫలితాలను పొందడం కోసం కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా చామంతి టీ తాగుతూ ఉండాలి.

Updated Date - 2023-07-04T13:00:52+05:30 IST