Hormone Health: హార్మోన్లు సమర్థవంతంగా పని చేయాలంటే..!

ABN , First Publish Date - 2023-07-11T12:57:21+05:30 IST

ఉత్పాదకత, ఆనందం, ఏకాగ్రత.. వీటిని పెంచుకోవాలంటే నాలుగు హార్మోన్ల పనితీరును సమర్థంగా ఉండేలా చూసుకోవాలి.

Hormone Health: హార్మోన్లు సమర్థవంతంగా పని చేయాలంటే..!

ఉత్పాదకత, ఆనందం, ఏకాగ్రత.. వీటిని పెంచుకోవాలంటే నాలుగు హార్మోన్ల పనితీరును సమర్థంగా ఉండేలా చూసుకోవాలి.

సెరటోనిన్‌: నిద్ర, మూడ్‌, సంతోషం, ఇంకొన్ని జీవక్రియలకు క్రమబద్ధం చేసే ఈ హార్మోన్‌ సమర్థంగా విడుదల కావాలంటే....

  • ట్రిప్టోఫాన్‌ అనే అమీనో యాసిడ్‌ సమృద్ధిగా దొరికే గుడ్లు, చీజ్‌, చేపలు తినాలి.

  • క్రమం తప్పక వ్యాయామం చేయాలి. నడక కూడా వ్యాయామమే! కాబట్టి ప్రతి రోజూ 30 నిమిషాలు నడిచినా చాలు.ధ్యానం చేయాలి. శరీరారికి ఎండ సోకేలా చూసుకోవాలి.

డోపమైన్‌: ఆనందాన్ని అందించే వాటిని పొందడానికి పోత్సహించే హార్మోన్‌ ఇది. అయితే కొన్ని చవకబారు మార్గాల్లో లభించే ఆనందంతో ఏకాగ్రత, ప్రేరణలు కుంటుపడతాయి. ఈ హార్మోన్‌ను పొందాలంటే...

  • రోజువారీ అందుకోగల లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి.

  • సామాజిక మాధ్యమాల ఉపయోగం తగ్గించాలి.

  • 11 నిమిషాల ఐస్‌ బాత్‌ లేదా చల్ల నీళ్ల స్నానం చేయాలి.

ఎండార్ఫిన్స్‌: ఇది పెయిన్‌ కిల్లర్‌ హార్మోన్‌. నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించి, ఒత్తిడిని తొలగించి, ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఈ హార్మోన్లు తగ్గితే మూడ్‌ స్వింగ్స్‌, డిప్రెషన్‌, యాంగ్జయుటీలు పెరుగుతాయి.

  • రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌, వాకింగ్‌ క్రమం తప్పక చేయాలి.

  • డార్క్‌ చాక్లెట్‌ తినాలి (కోకో ఎండార్ఫిన్లను పెంచుతుంది)

  • మనసారా నవ్వాలి.

ఆక్సిటోసిన్‌: భావోద్వేగాల స్పందనలు, సామాజిక ప్రవర్తలను ఈ హార్మోన్‌ ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్‌ తగ్గితే, కమ్యూనికేషన్‌లో వెనకబడతాం. చీకాకు పెరుగుతుంది. ఒంటరితనం వేధిస్తుంది.

  • ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడపాలి.

  • పెంపుడు జంతువులతో సమయం గడపాలి.

  • నచ్చిన అభిరుచికి సమయం వెచ్చించాలి.

Updated Date - 2023-07-11T12:57:21+05:30 IST