Vitamin D: విటమిన్‌-డి తక్కువగా ఉంటే ప్రమాదమేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

ABN , First Publish Date - 2023-07-20T11:49:56+05:30 IST

ఈ మధ్య పరీక్షలు చేయించుకుంటే విటమిన్‌-డి తక్కువగా ఉందని తేలింది. దీని వల్ల తీవ్రమైన ప్రమాదం ఏదైనా ఉందా?

Vitamin D: విటమిన్‌-డి తక్కువగా ఉంటే ప్రమాదమేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

ఈ మధ్య పరీక్షలు చేయించుకుంటే విటమిన్‌-డి తక్కువగా ఉందని తేలింది. దీని వల్ల తీవ్రమైన ప్రమాదం ఏదైనా ఉందా?

- నాగలక్ష్మి, మహబూబాబాద్‌

మన శరీరానికి అత్యంత అవసరమైన వాటిలో విటమిన్‌-డి ఒకటి. మన ఎముకల నుంచి రక్తంలోకి కాల్షియం కలవాలన్నా.. ఫోస్పైట్‌ వంటివి మనకు అందలన్నా విటమిన్‌-డి అత్యవసరం. సాధారణంగా సూర్యకిరణాల నుంచి మనకు విటమిన్‌-డి లభిస్తుంది. ఆధునిక జీవన శైలి కారణంగా ఎక్కువ మందికి సూర్యరశ్మి తగలటం లేదు. దీని వల్ల విటమిన్‌-డి లోపం పెరుగుతోంది. విటమిన్‌-డి లోపం ఉన్నా మనకు ఎటువంటి అనారోగ్య లక్షణాలు బయటకు కనబడవు. అందువల్ల ఎక్కువ మందికి విటమిన్‌-డి లోపం ఉందో లేదో కూడా తెలియదు. ఎక్కువ కాలం విటమిన్‌-డి లోపం ఉంటే- దాని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావటం మొదలవుతాయి. వళ్లు నెప్పులు.. ఎముకల నెప్పి.. కీళ్ల నెప్పులు.. చేతులు, కాళ్లు- తిమ్మిరి ఎక్కడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎటువంటి కారణం లేకుండా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారు విటమిన్‌-డి టెస్ట్‌ చేయించుకోవటం మంచిది. ఒక వేళ విటమిన్‌-డి తక్కువగా ఉంటే వెంటనే మందులు వాడాలి. మందులతో పాటుగా విటమిన్‌-డి ఎక్కువగా లభించే ఆవు పాలు, సోయా పాలు, గుడ్లు, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిది.

Updated Date - 2023-07-20T11:49:56+05:30 IST