Liver: కామెర్లను లైట్ తీసుకుంటున్నారా? నాటు మందుతో సరిపెట్టుకుంటే మాత్రం..!

ABN , First Publish Date - 2023-04-06T11:08:59+05:30 IST

కామెర్లు సోకినప్పుడు పత్యం చేస్తూ, పసరు మందు తీసుకుంటే సరిపోతుంది అంటారు. ఈ మందుతో ఎంతవరకూ ప్రయోజనం ఉంటుంది?

Liver: కామెర్లను లైట్ తీసుకుంటున్నారా? నాటు మందుతో సరిపెట్టుకుంటే మాత్రం..!
Liver

డాక్టర్‌! కామెర్లు సోకినప్పుడు పత్యం చేస్తూ, పసరు మందు తీసుకుంటే సరిపోతుంది అంటారు. ఈ మందుతో ఎంతవరకూ ప్రయోజనం ఉంటుంది?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

కాలేయం జబ్బు (liver disease) పడిందనడానికి కామెర్లు ఒక సంకేతం అనే విషయం అందరికీ తెలుసు. అయితే కామెర్లకు (Jaundice) కారణమైన కాలేయ జబ్బుకు అసలు కారణాన్ని వైద్య సహాయంతో కనిపెట్టి, అందుకు తగిన చికిత్స తీసుకోవడం ఎంతో కీలకం అనే విషయం ఎవరికీ తెలియదు. మూలికా వైద్యాలు, ఇతరత్రా నాటు మందుల వల్ల కాలేయానికి మేలు కంటే హాని ఎక్కువ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్‌ ఫెయిల్యూర్‌కూ దారి తీయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కాలేయ మార్పిడి అవసరం అవుతుంది. కాబట్టి కామెర్లు కనిపించినప్పుడు కాలేయ వ్యాధి మరింత ముదిరిపోకుండా ఉండడం కోసం వైద్యుల సలహాలను తీసుకోవాలి. ఆకలి మందగించడం, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం, మత్తుగా ఉండడం, బరువు కోల్పోవడం, కాళ్ల వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. ఆలస్యం చేయడం వల్ల కాలేయ సిర్రోసిస్‌ లేదా కాలేయ కేన్సర్‌లకు గురి కాక తప్పదు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరిస్తూ, మద్యపానం మానుకుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూ హెపటైటిస్‌ పరీక్షలు క్రమం తప్పక చేయించుకుంటూ అవసరాన్ని బట్టి వైద్య సహాయం తీసుకోగలిగితే కాలేయ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

-డాక్టర్‌ నవీన్‌ పోలవరపు

చీఫ్‌ లివర్‌ స్పెషలిస్ట్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-04-06T11:08:59+05:30 IST