Beauty Kitchen Tips: అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!
ABN , First Publish Date - 2023-06-14T11:43:48+05:30 IST
అందం మెరుగు కోసం రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. వంట ఇంటిలో ఉండే పదార్థాలతోనే చర్మం, జుట్టుకు మాస్క్‌లు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. పైగా
అందం మెరుగు కోసం రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. వంట ఇంటిలో ఉండే పదార్థాలతోనే చర్మం, జుట్టుకు మాస్క్‌లు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. పైగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు.
ఎవరి ఇంట్లో అయినా పెరుగు ఉంటుంది. పెరుగు తింటే కడుపులో చల్లగా ఉంటుంది. దీంతో పాటు నిద్ర బాగా పడుతుంది. దీంతో పాటు ఆ పెరుగులోకి నిమ్మరసమో, కాస్త పసుపు కలిపి ఎంచక్కా హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. అరగంట తర్వాత కడిగేస్తే సరి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు మృదువుగా తయారవుతుంది.
డబ్బాలోంచి కేవలం టేబుల్ స్పూన్ శనగపిండి, టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపుతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మంలో కాంతి వస్తుంది. మచ్చలు, గీతలు తొలగిపోతాయి.
ఎండాకాలంలో నిమ్మరసం తాగితే ఉపశమనం కలుగుతుంది. అదే నిమ్మను రెండుగా కట్ చేసి ఆ వొప్పులను స్క్రబ్‌లా ముఖానికి రుద్దుకోవచ్చు. ఇలా చేస్తే ముఖంపై మంటలు తగ్గుతాయి. ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
అలొవెరా జెల్, తేనె కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఎర్రగా కందడం, మంటలు ఉంటే తొలగిపోతాయి.
బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. బాగా మిక్స్ చేశాక.. ముఖానికి పట్టిస్తే చాలు.. ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇంట్లోని బ్రౌన్ షుగర్ ఉంటే అందులోకి కొబ్బరినూనె కొద్ది చుక్కలు వేసి స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు.
మందారం ఆకులు, మందారం పూలను సమపాళ్లలో గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను హెయిర్‌మా్‌స్కగా వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తినటానికి తెచ్చుకున్న అరటిపండ్లు లేదా బొప్పాయి లాంటివి వృధా అవుతాయేమో అనుకుంటే.. ముందుగా వాటిని గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జును ముఖానికి పట్టిస్తే ముఖం కాంతింవంతంగా తయారవుతుంది.