Monsoon Makeup: వానాకాలంలో అదిరిపోయే లుక్స్ కోసం..!

ABN , First Publish Date - 2023-07-01T12:48:29+05:30 IST

మేకప్‌కు బద్ధశత్రువులైన ఉక్కపోత, హ్యుమిడిటీ, వానలు ఈ కాలంలో వేధిస్తాయి. కాబట్టి వానాకాలం మేకప్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. మెరుగైన లుక్స్‌ కోసం ఈ కాలంలో మేకప్‌ను కూడా వాటర్‌ప్రూఫ్‌ చేయాలి.

Monsoon Makeup: వానాకాలంలో అదిరిపోయే లుక్స్ కోసం..!

మేకప్‌కు బద్ధశత్రువులైన ఉక్కపోత, హ్యుమిడిటీ, వానలు ఈ కాలంలో వేధిస్తాయి. కాబట్టి వానాకాలం మేకప్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. మెరుగైన లుక్స్‌ కోసం ఈ కాలంలో మేకప్‌ను కూడా వాటర్‌ప్రూఫ్‌ చేయాలి.

వాటర్‌ బేస్‌డ్‌ మాయిశ్చరైజర్‌

వర్షాకాలంలో చర్మాని హైడ్రేట్‌గా ఉంచుకోవడం తప్పనిసరి. లేదంటే మేకప్‌ పొట్టు పొట్టుగా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండడం కోసం ఆయిల్‌ బేస్‌డ్‌ మాయిశ్చరైజర్లకు బదులుగా మంచి నాణ్యమైన వాటర్‌ బేస్‌డ్‌ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఈ మాయిశ్చరైజర్‌ అప్లై చేసిన తర్వాతే మేకప్‌ మొదలు పెట్టాలి.

వాటర్‌ప్రూఫ్‌ ప్రొడక్ట్స్‌

వానకు మేకప్‌ కారిపోకుండా ఉండాలంటే ఈ కాలంలో మేక్‌పలో ఉపయోగించే ఉత్పత్తులన్నీ వాటర్‌బే్‌సడ్‌వే అయి ఉండాలి. హ్యుమిడిటీకి చెదిరిపోకుండా ఉండే వాటర్‌ రెసిస్టెంట్‌ మస్కారాను వాడుకోవాలి. దీన్ని తేలికగా తొలగించవచ్చు. పైగా తొలగించిన తర్వాత ల్యాష్‌ లైన్‌ ఆనవాళ్లు కూడా కనిపించవు.

పౌడర్‌ బేస్‌డ్‌ మేకప్‌

కాంటూర్స్‌, క్రీమ్స్‌కు బదులుగా పౌడర్‌ బేస్‌డ్‌ మేక్‌పను ఎంచుకోవాలి. ఇందుకోసం మీ దగ్గర ఉన్న లిక్విడ్‌ ఫౌండేషన్‌లో కొద్దిగా పౌడర్‌ కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మందపాటి ఫౌండేషన్‌ బ్రష్‌తో పలుచని లేయర్లలా అప్లై చేసుకుంటే, ఫ్లాలెస్‌ లుక్‌ సొంతమవుతుంది.

వీలైనంత తక్కువే మేలు

వానాకాలంలో వీలైనంత తక్కువ మేకప్‌ వేసుకోవాలి. ముఖంలోని ఫీచర్స్‌ను హైలైట్‌ చేసుకోవాలి. అంతే తప్ప, మేకప్‌ ఉత్పత్తులతో అదనపు లేయర్స్‌ వేసుకోకూడదు. ఇలా పలుచని మేకప్‌ వేసుకోవడం వల్ల సహససిద్ధమైన లుక్‌ సొంతమవడంతో పాటు వానకు మేకప్‌ తడిచినా, కారిపోయే ప్రమాదం ఉండదు.

Updated Date - 2023-07-01T12:48:29+05:30 IST