Cancer: మగవాళ్లకు పొంచి ఉన్న ముప్పు
ABN , First Publish Date - 2023-02-14T12:58:47+05:30 IST
పురుషుల (Mens)కు సోకే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate cancer) ప్రధానమైనది. మన దేశంలో ఈ క్యాన్సర్ పట్ల అవగాహన లోపం వల్ల ఎంతో మంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో
పురుషుల (Mens)కు సోకే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate cancer) ప్రధానమైనది. మన దేశంలో ఈ క్యాన్సర్ పట్ల అవగాహన లోపం వల్ల ఎంతో మంది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పురుషుడూ క్రమం తప్పకుండా ప్రోస్టేట్ స్ర్కీనింగ్ (Screening) చేయించుకోవాలని పలు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి.
50 ఏళ్లు దాటిన పురుషులకు స్ర్కీనింగ్ తప్పనిసరి
50 ఏళ్లు దాటిన పురుషులు ప్రతి ఏడాదీ ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ (పిఎస్‌ఎ) రక్తపరీక్ష (blood test), డిజిటల్ రెక్టల్ పరీక్ష (Digital rectal examination) చేయించుకోవాలి. అంతే కాకుండా, కుటుంబంలో ఎవరికైనా (తల్లితండ్రులు, సోదరులు, అక్కాచెల్లెళ్లు) ప్రోస్టేట్ క్యాన్సర్, లేదా ఇతరత్రా కేన్సర్లు ఉంటే, మిగతా కుటుంబసభ్యులు 40 ఏళ్ల వయసు నుంచే క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయించుకోవాలి.
స్త్రీ, పురుషులకు తప్పని పుట్టుమచ్చల ముప్పు
పుట్టుమచ్చలు (Moles) కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్ల (Skin cancers)కు దారి తీయవచ్చు. కాబట్టి చర్మం (Skin) మీద ఏర్పడే పుట్టుమచ్చల్లో ఏదైనా మార్పు కనిపించినా, వాటి పరిమాణంలో లేదా ఆకారంలో మార్పు కనిపించినా వాటిని క్యాన్సర్ మచ్చలుగా అనుమానించవలసి ఉంటుంది. అయితే చర్మం మీద ఉన్న పుట్టుమచ్చలు సాధారణమైనవా లేక క్యాన్సర్ సంబంధిత మచ్చలా అనేది తెలుసుకోవడం కోసం ఎబిసిడిఇ పద్ధతిని అనుసరించవచ్చు:
ఇది కూడా చదవండి: Newly Married Couple: ఈ కొత్త జంటకు దేవుడెంత అన్యాయం చేశాడంటే..
ఎబిసిడిఇ పద్ధతి అంటే?
ఎ: పుట్టుమచ్చలను మధ్యగా విభజించి చూసినప్పుడు రెండు అర్థభాగాలు ఒకేలా ఉండకూడదు.
బి: పుట్టుమచ్చ అంచులు, పలుచని రంగులో లేదా గరుకుగా ఉండకూడదు.
సి: పుట్టుమచ్చ రంగులో మార్పు రాకూడదు.
డి: పుట్టుమచ్చ వ్యాసం 1/4 అంగుళం కన్నా ఎక్కువగా ఉండకూడదు.
ఇ: పుట్టుమచ్చ చర్మం మీద ఉబ్బెత్తుగా, వాచినట్టుగా ఉండకూడదు.
ఈ లక్షణాలు ఉంటే అది పెద్ద పేగు క్యాన్సర్ కావచ్చు:
పెద్ద పేగులో క్యాన్సర్ వ్యాధి మొదట చిన్న గుల్లలుగా మొదలై క్రమంగా క్యాన్సర్ కణుతులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే పెద్ద పేగు క్యాన్సర్‌గా అనుమానించవలసిందే!
పెద్దపేగు క్యాన్సర్ ప్రధాన లక్షణాలు:
పొత్తికడుపు భాగంలో నొప్పి లేదా పట్టేసినట్టు ఉండడం
ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం దగ్గర రక్తస్రావం కావడం, మలంలో రక్తం పడడం
డయేరియా, మలబద్ధకం సమస్యలు దీర్ఘకాలం కొనసాగడం
వీళ్లు అప్రమత్తంగా ఉండాలి:
గతంలో క్యాన్సర్ వచ్చి తగ్గినవాళ్లు
అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నవారు
రక్తసంబంధీకుల్లో (తల్లితండ్రులు, తోబుట్టువులు, పిల్లలు) ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్టు తేలితే అప్రమత్తంగా ఉండాలి.
ప్రతి మూడేళ్లకోసారి ఎఫ్‌ఒబిటి, ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపి వంటి పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి: ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. 2 నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?
ఆ కారణాల వల్ల పెరుగుతున్న నోటి క్యాన్సర్
మన దేశంలో ఇతర క్యాన్సర్ల కంటే నోటి క్యాన్సర్ బాధితుల సంఖ్య అధికంగానే కనిపిస్తోంది. కాబట్టి ప్రతి వ్యక్తికీ నోటి క్యాన్సర్ స్ర్కీనింగ్ ఎంతో అవసరం. సాధారణంగా నోట్లో కలిగే ప్రాథమిక మార్పుల వల్ల కూడా నోటి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. అధిక శాతం మందిలో పొగాకు ఉత్పత్తులు తినడం, పొగ తాగడం, మద్యపానం వంటి కారణాల వల్ల నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. నోట్లో మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు లాంటి అలవాట్లు ఉన్నవాళ్లు వెంటనే వాటిని మానుకోవాలి. నోట్లో ఏవైనా గడ్డలు లేదా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రతించి, సకాలంలో చికిత్స తీసుకోవాలి. నోట్లో లేదా గొంతులో, చెంపల మీద ఏర్పడే పుండ్లను తేలికగా తీసుకోకూడదు.
-డాక్టర్ సి.హెచ్ మోహన వంశీ,
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్.
ఫోన్ నంబర్: 9849022121