Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదొకటి తినేద్దామనుకుంటున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..!
ABN , First Publish Date - 2023-06-15T12:07:25+05:30 IST
ఉదయాన్నే బ్రేక్‌ఫాక్ట్‌లో ఏం తినాలనేది చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే
ఉదయాన్నే బ్రేక్‌ఫాక్ట్‌లో ఏం తినాలనేది చాలా మందికి ఎదురయ్యే ప్రధాన సమస్య. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే పదార్థాలు తినాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినటంతో పాటుగా కొన్ని రకాల ఆహార పదార్థాలను వీలైనంత వరకు తినవద్దని సలహా ఇస్తున్నారు. అలాంటి పదార్థాలేమిటో చూద్దాం..
కార్న్‌ఫ్లేక్స్
చాలా మంది కార్న్‌ఫ్లేక్స్ తినటం వల్ల ప్రయోజనం ఉందని భావిస్తారు. కార్న్‌ఫ్లేక్స్‌లో ఎటువంటి ప్రొటీను ఉండదు. ఈ మధ్యకాలంలో రకరకాల కార్న్‌ప్లేక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటిలోను సుగర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినటం వల్ల ఉదయాన్నే సుగర్ విలువలు పెరుగుతాయి. అందువల్ల కార్న్‌ఫ్లేక్స్‌ను తినకపోవటం మంచిది.
టోస్ట్
చాలా మంది బ్రెడ్‌టోస్ట్‌ను మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తారు. కానీ బ్రెడ్‌టోస్ట్ ద్వారా మనకు లభించే కేలరీలు బ్రెడ్‌లోని కార్బోహైడ్రేడ్స్ నుంచి వెన్నలో ఉండే కొవ్వు నుంచి లభిస్తాయి. దీని ద్వారా ఎటువంటి ప్రొటీను లభించదు. అయితే మామూలు బ్రెడ్ బదులుగా హోల్ గ్రౌన్ బ్రెడ్‌ను వాడి.. గుడ్లతో కలిపి తీసుకుంటే ప్రొటీను లభిస్తుంది. వీటితో పాటుగా ఆకు కూరలు, టమోటాల వంటి జత చేసి తిన్నా మంచిదే!
పూరీలు
వీలైనంత వరకు పూరీల వంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో తినకపోవటం మంచిది. నూనెలో బాగా వేయించటం వల్ల రోజంతా దాహంగా అనిపిస్తుంది. అంతే కాకుండా దీనిలో ప్రొటీను ఉండదు. అదే విధంగా ఎక్కువ కేలరీలు కూడా ఉంటాయి. అందువల్ల వీటిని తినకపోవటం మంచిది.
ఫ్రూట్ జ్యూస్- తీపి పెరుగు
ఫ్రూట్ జ్యూస్‌లలో అనేక న్యూట్రెంట్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అయితే వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉండదు. అందువల్ల దీనిని తాగకపోవటం మంచిది. ఇక తీపి పెరుగు (యోగర్ట్) విషయానికి వస్తే- దీనిలో చక్కెర కలపటం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయి. అంతే కాకుండా చాలా రకాల యోగర్ట్‌లలో కొవ్వు కూడా ఉండదు.