Papaya: బొప్పాయితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

ABN , First Publish Date - 2023-09-21T12:24:36+05:30 IST

మనకు అన్ని కాలాలలో లభించే పండు బొప్పాయి. తినటానికి రుచిగా ఉండటమే కాదు.. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు పౌష్టికాహార నిపుణులు. అవేమిటో చూద్దాం..

Papaya: బొప్పాయితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

మనకు అన్ని కాలాలలో లభించే పండు బొప్పాయి. తినటానికి రుచిగా ఉండటమే కాదు.. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు పౌష్టికాహార నిపుణులు. అవేమిటో చూద్దాం..

బొప్పాయిలో కార్టినోయిడ్స్‌ అనే యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి మనకు హాని చేసే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయి. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బొప్పాయిలో పాపైన్‌ అనే ఒక ఎంజైమ్‌ ఉంటుంది. ఇది మనం తినే ఆహారం సులభంగా జీర్ణం కావటంలో ఉపకరిస్తుంది. దీనిలో ఉండే ఇతర పదార్థాలు జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

ఎంత తినాలి?

బొప్పాయిని ఎంత తినాలి అనే విషయంలో కచ్చితమైన లెక్క ఏమి లేదు. ఆరోగ్యవంతులు ప్రతి రోజు ఒక పెద్ద బొప్పాయిలో సగం ముక్క తినవచ్చు. అయితే పాలలో ఉండే లాటెక్స్‌ పదార్థం అలర్జీ ఉన్నవారు బొప్పాయిని ఎక్కువగా తినకూడదు. దీని వల్ల అలర్జీ వచ్చే అవకాశముంది. ఇదే విధంగా గర్భిణులు కూడా బొప్పాయి తినకపోవటం మంచిది. దీనిలో లాటెక్స్‌ సాంద్రత ఎక్కువ. అందవల్ల గర్భసంచి సంకోచవ్యాకోచాలకు గురయ్యే అవకాశముంది.

Updated Date - 2023-09-21T12:24:36+05:30 IST