Counselling: మనసుకు చికిత్స అవసరమే!

ABN , First Publish Date - 2023-09-21T11:59:31+05:30 IST

డాక్టర్‌! నా వయసు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాను. జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడింది. మానసికంగా కుంగిపోతున్నాను. పనుల మీద శ్రద్ధ తగ్గుతోంది. ఈ లక్షణాలను ఏ విధంగా భావించాలి. మానసిక చికిత్స తీసుకోవడం అవసరమంటారా?

Counselling: మనసుకు చికిత్స అవసరమే!

డాక్టర్‌! నా వయసు 35 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాను. జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడింది. మానసికంగా కుంగిపోతున్నాను. పనుల మీద శ్రద్ధ తగ్గుతోంది. ఈ లక్షణాలను ఏ విధంగా భావించాలి. మానసిక చికిత్స తీసుకోవడం అవసరమంటారా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

నిజానికి ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో మానసిక కుంగుబాటుకు గురవుతూ ఉంటాం. అయితే పడి లేచినట్టే, దాన్నుంచి బయటకొచ్చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అది అసాధ్యమవుతుంది. తీవ్రమైన మానసిక కుంగుబాటు డిప్రెషన్‌ అనీ, దానికి చికిత్స ఉందనే అవగాహన మీలాంటి చాలా మందికి ఉండదు. డిప్రెషన్‌ ప్రధాన లక్షణం భవిష్యత్తు మీద ఆశ లోపించడం. ఒక ఖాళీతనం ఏర్పడడం. అసలు జీవితమే లేకపోతే సమస్యలే ఉండవుగా? అలాంటప్పుడు జీవితాన్నే అంతం చేసుకుంటే? అనే ఒక లాజికల్‌ థింకింగ్‌ మొదలవుతుంది. ఆ ఆలోచనే అంతిమంగా ఆత్మహత్యకు పురిగొల్పుతుంది. ఇంతదూరం రాకుండా ఉండాలంటే డిప్రెషన్‌ను మొదట్లోనే గ్రహించాలి.

అంతా మెదడులోనే!

మెదడులో కొన్ని న్యూరోకెమికల్స్‌ వాటి పనితీరులో హెచ్చుతగ్గులు జరిగితే డిప్రెషన్‌ బారిన పడతాం! కాబట్టే వడ్డించిన విస్తరిలాంటి జీవితం కలిగి ఉండే సెలబ్రిటీలు కూడా అకారణంగా డిప్రెషన్‌కు గురవుతూ ఉంటారు. జన్యుపరంగా డిప్రెషన్‌కు గురయ్యే లక్షణాలున్న వ్యక్తుల్లో కూడా న్యూరోకెమికల్స్‌ తేలికగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ఇలాంటివాళ్లు డిప్రెషన్‌ డిజార్డర్‌కు గురవుతారు. సమస్య గ్రహించి మందులతో చికిత్స చేస్తే తిరిగి తేలికగానే కోలుకుంటారు.

ఈ లక్షణాలు గమనించాలి

  • దేని మీదా ఆసక్తి లేకపోవడం

  • తిండి, నిద్ర, స్నానం, తయారవడం... రోజువారీ పనులన్నీ క్రమం తప్పడం

  • హఠాత్తుగా మౌనంగా మారిపోవడం

  • ఒంటరిగా గడపడం

  • ఏడ్వడం, అకారణంగా కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉండడం

  • ఇష్టమైన పనులను కూడా చేయాలని అనిపించకపోవడం

  • నిస్సత్తువ

  • ఈ లక్షణాలు మిమ్మల్ని రెండు వారాలకు మించి వేధిస్తూ ఉంటే డిప్రెషన్‌గా భావించి వెంటనే మానసిక వైద్యులను సంప్రతించండి.

- డాక్టర్‌ జ్యోతిర్మయి, సైకియాట్రిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-09-21T11:59:31+05:30 IST