Cycling: సైకిలింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలో..!

ABN , First Publish Date - 2023-06-22T14:52:14+05:30 IST

సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం బ్యాలెన్స్‌ అవుతుంది. ముఖ్యంగా బరువు ఉండే వాళ్లు సైకిల్‌ తొక్కడం వల్ల తెలీకుండా కండరాల కదలిక జరుగుతుంది. కొవ్వుశాతం కరిగిపోతుంది. బరువు తగ్గుతారు.

Cycling: సైకిలింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలో..!

ప్రతి రోజూ ఉదయం లేదా సాయంకాలం వేళలో సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నడవటం, పరిగెత్తడం కంటే సైక్లింగ్‌ చేయటానికి ఇష్టపడుతున్నారు ఆధునిక మహిళలు. సైకిల్‌ తొక్కడం ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది.

● సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం బ్యాలెన్స్‌ అవుతుంది. ముఖ్యంగా బరువు ఉండే వాళ్లు సైకిల్‌ తొక్కడం వల్ల తెలీకుండా కండరాల కదలిక జరుగుతుంది. కొవ్వుశాతం కరిగిపోతుంది. బరువు తగ్గుతారు.

● శారీరక శ్రమ వల్ల శరీర అవయవాల మధ్య కో–ఆర్డినేషన్‌ బాగా అభివృద్ధి చెందుతుంది.

● ఇదో అద్భుతమైన ఫిట్‌నెస్‌ మంత్రం. సైకిల్‌ తొక్కితే బరువు తగ్గడమే కాదు శరీరంలోని టాక్సిన్స్‌ కరిగిపోతాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది.

● అరికాళ్లు, పాదాలు, మోకాళ్లు గట్టిపడతాయి. కండరాలన్నీ యాక్టివేట్‌ అవుతాయి.

● సైక్లింగ్‌ను దినచర్యలా చేసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. ఉత్సాహం వస్తుంది. పైగా బోర్‌లా ఫీల్‌ కారు. ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. డిప్రెషన్‌ లాంటి లక్షణాలుంటే తొలగిపోతాయి.

● ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

● రోజుకు నాలుగైదు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కితే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యానికెంతో మంచిది.

● ప్రతిరోజూ సైక్లింగ్‌ చేస్తే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

● శరీరరంలో కొత్త శక్తి వచ్చినట్లుండటంతో పాటు కణాలకు ఆక్సిజన్‌ అందటం వల్ల చర్మంలో మెరుపు వస్తుంది. యంగ్‌లుక్‌లో కనిపిస్తారు.

Updated Date - 2023-06-22T14:53:12+05:30 IST