అజీర్తితో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!
ABN , First Publish Date - 2023-06-06T13:49:34+05:30 IST
కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. అయితే దానికి విరుగుడుగా కొన్ని పదార్థాలను తినడం ద్వారా, ఆ దోషం
కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. అయితే దానికి విరుగుడుగా కొన్ని పదార్థాలను తినడం ద్వారా, ఆ దోషం తొలగిపోతుంది. ఆయా పదార్థాలు, వాటి విరుగుళ్ల వివరాలు.....
నేతితో తయారు చేసిన పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తి, నిమ్మరసాన్ని మజ్జిగలో కలిపి, కాస్తంత ఉప్పు కలిపి తాగితే తగ్గిపోతుంది.
నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను ఎక్కువగా తినడం వల్ల కలిగే అజీర్తికి, కొంచెం బెల్లం తింటే చాలు.
మామిడ పండ్లు ఎక్కువగా తింటే కలిగే అజీర్తి, మూడు పూటలా ఒక్కోగ్లాసు చొప్పున మజ్జిగ తాగితే తగ్గుతుంది.
బాదం పప్పు అతిగా తింటే కలిగే అజీర్తికి, ఒక లవంగం తింటే చాలు.
పాయసం ఎక్కువగా తింటే కలిగే అజీర్తి, పెసరకట్టు తాగితే తగ్గిపోతుంది.
అరటి పండ్లు ఎక్కువగా తింటే కలిగే అజీర్తి, నేతిలో కొంచెం పంచదార కలిపి తింటే తొలగిపోతుంది.
మినప పప్పుతో చేసిన గారెలు, సున్నుండలు ఎక్కువగా తింటే కలిగే అజీర్తికి మజ్జిగ తాగితే సరిపోతుంది.
శనగలు, శనగ వంటకాలు ఎక్కువగా తిన్నప్పుడు కలిగే అజీర్తికి, కొంచెం ముల్లంగి రసం తాగితే తగ్గిపోతుంది.
కందకూర గానీ, పులుసు గానీ ఎక్కువగా సేవిస్తే కలిగే అజీర్తికి కొంచెం బెల్లం తింటే సరిపోతుంది.