Share News

Moringa: ములక్కాడల గురించి కాదు.. మునగాకు గురించి ఈ నిజాలు తెలుసా?

ABN , Publish Date - Dec 28 , 2023 | 06:06 PM

ములక్కాడలు చాలామంది ఇష్టంగా తినే కూరగాయ. లేత ములక్కాడలను వివిధ రకాల కూరలుగా వండి తింటుంటారు. ములక్కాడలలో బోలెడు పోషకాలు ఉంటాయి. చాలామంది ములక్కాడల వరకే ఆగిపోతారు. కానీ మునగ చెట్టు ఆకులను వాడేవారు తక్కువ. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆకులను పప్పు, పొడికూర, కారం పొడి..

Moringa: ములక్కాడల గురించి కాదు.. మునగాకు గురించి ఈ నిజాలు  తెలుసా?

ములక్కాడలు చాలామంది ఇష్టంగా తినే కూరగాయ. లేత ములక్కాడలను వివిధ రకాల కూరలుగా వండి తింటుంటారు. ములక్కాడలలో బోలెడు పోషకాలు ఉంటాయి. చాలామంది ములక్కాడల వరకే ఆగిపోతారు. కానీ మునగ చెట్టు ఆకులను వాడేవారు తక్కువ. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆకులను పప్పు, పొడికూర, కారం పొడి.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. ఇది చాలా పవర్ ఫుల్ అని అంటారు. మునగాకు గురించి మీకు తెలియని నిజాలేంటో ఓ లుక్కేయండి.

పోషకాలకు పవర్ హౌస్..

మునగాకు పోషకాలకు పవర్ హౌస్ గా పిలవబడుతుంది. దీంట్లో విటమిన్-ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో అమైనో ఆమ్లాలు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. మునగాకును ఆహారంలో తీసుకుంటే ఈ పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి.

యాంటీ ఆక్సిడెంట్..

మునగాకులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

యాంటీ ఇన్ప్లమేటరీ..

మునగాకులో ఐసోథియో సైనేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బయోయాక్టీవ్ సమ్మేళనాలు. ఇది శరీరలో నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.


షుగర్ లెవల్స్..

చాలామందికి మునగాకుతో చక్కెర వ్యాధిని నియంత్రణలో పెట్టవచ్చని తెలుసు. రక్తంలో చక్కెర స్థాయిపై మునగాకు మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

కొలెస్ట్రాల్..

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియత్రించడంలో కూడా మునగాకు సహాయపడుతుంది. మునగాకులోని బీటా-సిటోస్టెరాల్ వంటి సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యానికి మంచిది.

చర్మానికి, జుట్టుకు..

మునగాకు పై ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా జుట్టు పెరగడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. మునగాకును ఆహారంలో భాగంగా తిన్నా, ఎండిన మునగాకు పొడిని రోజూ కొద్దిమొత్తంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా మునగాకును హెయిర్ ప్యాక్ గానూ, ఫేస్ ప్యాక్ గానూ కూడా ఉపయోగిస్తారు.

Updated Date - Dec 28 , 2023 | 06:16 PM