Chest pain: ఛాతీలో మంటకు ప్రధాన కారణాలు ఇవే..!

ABN , First Publish Date - 2023-05-20T11:45:45+05:30 IST

ఛాతీలో, సరిగ్గా ఛాతీ ఎముక మధ్యలో అసౌకర్యం కలగడం, తిన్న వెంటనే, నిద్రలో, వంగినప్పుడు అసౌకర్యం

Chest pain: ఛాతీలో మంటకు ప్రధాన కారణాలు ఇవే..!
Chest pain

ఛాతీలో, సరిగ్గా ఛాతీ ఎముక మధ్యలో అసౌకర్యం కలగడం, తిన్న వెంటనే, నిద్రలో, వంగినప్పుడు అసౌకర్యం ఎక్కువవడం అసిడిటీ లక్షణాలు. అయితే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్‌ అల్సర్లకూ, పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌కూ దారి తీయవచ్చు. కాబట్టి ఛాతీలో మంటకు ఈ చిట్కాలు పాటించి చూడండి.

సమయానికి తినాలి: భోజనాన్ని స్కిప్‌ చేయడం ఛాతీలో మంటకు ప్రధాన కారణం. కాబట్టి సమయానికి భోంచేయాలి.

ఉపవాసం వద్దు: ఉపవాసంతో పొట్టలోని యాసిడ్‌ ఎగదన్ని ఛాతీలో మంట ఎక్కువవుతుంది. కాబట్టి ఉపవాసాలు మానుకోవాలి.

వీటికి దూరం: మసాలాలు, కారాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. నిమ్మ, నారింజ లాంటి పుల్లటి పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.

విరుగుడు: ధనియాలు వేసి కాచిన నీళ్లు కడుపును చల్లబరుస్తాయి. అదనపు యాసిడ్‌ ఉత్పత్తిని తగ్గిస్తాయి. సోంపు కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. కాబట్టి భోజనం తర్వాత చెంచాడు సోంపు నమిలి తినడం మంచిది.

Updated Date - 2023-05-20T11:45:45+05:30 IST