Makeup: ముఖం తళుక్కుమనాలంటే...

ABN , First Publish Date - 2023-09-18T12:30:25+05:30 IST

చర్మాన్ని ఆర్టిస్ట్‌ ఉపయోగించే కాన్వాస్‌గా పరిగణించాలి. పొడిబారి, ఎగుడు దిగుడుగా ఉంటే ముఖ చర్మం మీద మేకప్‌ నిలిచి ఉండదు. కాబట్టి ముఖానికి వేసే మేకప్‌లో ఈ మెలకువలు పాటించాలి.

Makeup: ముఖం తళుక్కుమనాలంటే...

చర్మాన్ని ఆర్టిస్ట్‌ ఉపయోగించే కాన్వాస్‌గా పరిగణించాలి. పొడిబారి, ఎగుడు దిగుడుగా ఉంటే ముఖ చర్మం మీద మేకప్‌ నిలిచి ఉండదు. కాబట్టి ముఖానికి వేసే మేకప్‌లో ఈ మెలకువలు పాటించాలి.

హైలైట్‌: ముఖంలో కనుబొమలు, పెదవులు... ఇలా ప్రతి ఒక్కరి ముఖంలో ఏదో ఒక ఆకట్టుకునే అంశం ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని సెంటర్‌ ఆఫ్‌ అటెన్షన్‌గా చేసి, దానికి తగ్గట్టు ముఖాన్ని న్యూట్రల్‌గా ఉంచే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఆకర్షణీయమైన కళ్లు ఉన్నవాళ్లు బోల్డ్‌ లైనర్‌ను ఉపయోగించాలి. పౌట్‌ను గుర్తించడం కోసం ముదురు రంగు లిప్‌స్టిక్‌ ఎంచుకోవాలి.

లైట్‌గా మొదలు పెట్టి: మేకప్‌ ఉత్పత్తులను వీలైనంత తక్కువగా వాడడం అలవాటు చేసుకోవాలి. కన్‌సీలర్‌ను అవసరానికి మించి వాడితే, దేన్నైతే దాచాలి అనుకున్నామో అదే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా కన్‌సీలర్‌ను చర్మం మీద అప్లై చేసి బ్రష్‌తో బ్లెండ్‌ చేసుకోవాలి. ఇంకొద్దిగా అవసరం పడితే, మళ్లీ అప్లై చేసుకోవాలి. అలాగే కన్‌సీలర్‌ను అప్లై చేయడం కోసం డో ఫుట్‌ అప్లికేటర్‌ను ఉపయోగించాలి.

ఐ షాడో బ్రష్‌: కనురెప్పల మీద ముడతలు ఉంటే, ఫ్లాట్‌ బ్రష్‌కు బదులుగా ఫ్లఫ్ఫీగా ఉండే బ్రష్‌ వాడాలి. ఫైన్‌ టిప్‌ బ్రష్‌ వాడడం వల్ల షాడో కనురెప్పల ముడతల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే చివర్లో క్రీజ్‌ బ్రష్‌తో అదనపు షాడోను తొలగించుకోవాలి.

Updated Date - 2023-09-18T12:30:25+05:30 IST