Makeup: కొన్ని చిట్కాలతో గోళ్ల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు!

ABN , First Publish Date - 2023-07-15T11:26:43+05:30 IST

గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా మేకప్‌లో భాగమే! కానీ గోళ్లు ఆకట్టుకునేలా ఉండాలంటే మానిక్యూర్‌ చేయించుకోక తప్పదు అనుకుంటాం. కానీ సొంతగా కూడా గోళ్ల అందాన్ని రెట్టింపు చేసుకోగలిగే చిట్కాలున్నాయి. కొన్ని చిన్నపాటి మెలకువలు పాటిస్తే, గోళ్ల సౌందర్యం ఇనుమడిస్తుంది.

Makeup: కొన్ని చిట్కాలతో గోళ్ల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు!

గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా మేకప్‌లో భాగమే! కానీ గోళ్లు ఆకట్టుకునేలా ఉండాలంటే మానిక్యూర్‌ చేయించుకోక తప్పదు అనుకుంటాం. కానీ సొంతగా కూడా గోళ్ల అందాన్ని రెట్టింపు చేసుకోగలిగే చిట్కాలున్నాయి. కొన్ని చిన్నపాటి మెలకువలు పాటిస్తే, గోళ్ల సౌందర్యం ఇనుమడిస్తుంది.

నెయిల్‌ పాలిష్‌

నిపుణులు సూచించే నాణ్యమైన నెయిల్‌ పాలి్‌షలను మాత్రమే ఎంచుకోవాలి. నాసి రకం నెయిల్‌ పాలి్‌షలతో గోళ్లు దెబ్బతిని, విరిగిపోతాయి. అలాగే గోళ్ల సహజసిద్ధమైన లేత గులాబీ రంగు కాస్తా పసుపు పచ్చగా మారిపోతుంది. గోళ్లు జీవాన్ని కూడా కోల్పోతాయి.

ఫైలింగ్‌/బప్ఫింగ్‌

నెయిల్‌ బెడ్‌కు రక్త ప్రసరణ పెరిగి గోళ్లు దృఢంగా ఉండడం కోసం తప్పనిసరిగా బప్ఫింగ్‌ చేయాలి. బఫ్ఫింగ్‌ లేదా ఫైలింగ్‌తో గోళ్లు నునుపుగా మారి, నెయిల్‌ పాలిష్‌ గోళ్ల మీద సమంగా పరుచుకుంటుంది. ఫైలింగ్‌తో గోళ్ల అంచులు కూడా నునుపుగా మారతాయి. గోళ్ల పైన పేరుకున్న మురికి కూడా వదులుతుంది.

బేస్‌, టాప్‌ కోట్స్‌

గోళ్లకు ఒకసారి రంగు వేస్తే సరిపోదు. వేలి గోళ్ల మీద ఉండే, అవక్షేపాలు, నూనెల వల్ల గోళ్ల రంగు పెచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి దృఢమైన బేస్‌ అవసరం. టాప్‌ కోట్‌తో రంగు చక్కగా అంటుకుని, పెచ్చులుగా ఊడిపోవడాన్ని నివారిస్తుంది. టాప్‌ కోట్‌తో చక్కని పాలి్‌షడ్‌ లుక్‌ సొంతమవుతుంది.

నేర్పుగా, ఓర్పుగా

బాటిల్‌లో నుంచి తీసిన బ్రష్‌ను నేరుగా గోరు మీద ఉంచేయకుండా, బ్రష్‌ను బాటిల్‌ అంచులకు అద్ది అదనపు నెయుల్‌ పాలి్‌షను వదిలించాలి. తర్వాత బ్రష్‌ను గోరు మధ్యలో క్యూటికల్‌ దగ్గరి నుంచి గోరు అంచు వరకూ ఒకే స్ట్రోక్‌లో లాగాలి. కుడి చేతి గోళ్లకు, ఎడమ చేతి వేళ్లతో రంగు వేసుకునేటప్పుడు, చేతిని చదునైన ప్రదేశం మీద ఉంచి, అనుకూలంగా తిప్పుతూ గోళ్లన్నిటికీ రంగు వేసుకోవాలి.

డ్రయింగ్‌ టైమ్‌

నెయిల్‌ పాలిష్‌ పూర్తిగా ఆరే సమయం ఇవ్వాలి. ఈ సమయాలు నెయిల్‌ పాలిష్‌ రకం, వేసిన కోట్స్‌ను బట్టి మారుతూ ఉంటాయి. రంగు గోటికి చక్కగా అంటుకుపోవడం కోసం కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది.

Updated Date - 2023-07-15T11:26:43+05:30 IST