Turmeric: పసుపుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-05-24T12:05:46+05:30 IST
పసుపును వంటల్లోకి వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది. చర్మానికి పట్టిస్తే ఎంతో మంచిది. ఇంతకీ పసుపుతో
పసుపును వంటల్లోకి వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది. చర్మానికి పట్టిస్తే ఎంతో మంచిది. ఇంతకీ పసుపుతో ఎలాంటి ఫేస్‌ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు.. వాటివల్ల ఎలాంటి ఉపయోగాలో తెలుసుకుందాం.
• బౌల్‌లోకి ఒక టేబుల్ స్పూన్ మంచి తేనె, టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి ఇరవై నిముషాల పాటు ఆరనివ్వాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మంమీద ఉండే నొప్పులు తొలగిపోతాయి. నల్లటి మచ్చలు పోతాయి.
• బౌల్‌లో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్, అర టీస్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ రసం పిండి మిశ్రమాన్ని కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించుకుని పదిహేను నిముషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
• టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలపాలి. మీ చర్మం పొడిగా ఉంటే టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఒకవేళ మీ చర్మం జిడ్డుగా ఉంటే నిమ్మరసం బదులు తేనె వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి మర్దనం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
• బౌల్‌లో టేబుల్ స్పూన్ పాలు, టీస్పూన్ పసుపు కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం మీద ఉండే మృతకణాలు తొలగిపోతాయి.
• రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్‌నూనె వేసిన తర్వాత అందులో టీస్పూన్ పసుపు కలపాలి. ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె తీసుకున్నా పర్వాలేదు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
• రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలోకి అరటీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఇందులోకి అరటీస్పూన్ పసుపు వేసి వీలయితే కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచూ పట్టించుకుంటుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
• టేబుల్ స్పూన్ పుదీనా పేస్ట్‌లోకి అరటీస్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉండే గాయాలు మానిపోతాయి.