Yoga: రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే..!

ABN , First Publish Date - 2023-06-10T11:20:29+05:30 IST

నడవటం, పరిగెత్తటం లాంటివి రోజూ చేయటం మంచిదే. వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అయితే

Yoga: రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే..!
Yoga

నడవటం, పరిగెత్తటం లాంటివి రోజూ చేయటం మంచిదే. వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అయితే యోగా చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.

  • యోగాసనాలు వేయటం వల్ల శరీరం స్ర్టెచ్‌ అయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజూ యోగాసనాలు వేయటం అలవాటు చేసుకుంటే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా గుండెకు మంచిది.

  • శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా ఫేస్‌లో కాంతి కనిపిస్తుంది.

  • శరీరానికి మంచి ఫిట్‌నె్‌సను ఇస్తుంది యోగా. శరీరం బ్యాలన్స్‌ అవ్వటం వల్ల కండరాలు మరింతగా గట్టిపడతాయి.

  • యోగాసనాలు వేయటం వల్ల ఏకాగ్రత కలుగుతుంది. తలనొప్పులు, వెన్నెముక లాంటి సమస్యలు తగ్గిపోతాయి. నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు యోగా అద్భుతమైన ఔషధంలా పని చేస్తుంది. సాఫీగా నిద్ర కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.

  • డిప్రెషన్‌ మూడ్‌ పోతుంది. మెంటల్‌గా స్ర్టాంగ్‌ కావటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

  • యోగా చేసేవారి వయసు కూడా కనపడదు. యంగ్‌ లుక్‌లో ఉంటారు. దీని వల్ల మరింత ఆనందం కలుగుతుంది. జీవనకాలం పెరుగుతుంది.

  • యోగాసనాలు వేయటం వల్ల ఎముకల్లో గట్టిదనం వస్తుంది. జీవక్రియ సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా మహిళ శారీరక, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. వ్యాధినిరోధక శక్తి కూడా కలుగుతుంది.

  • నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయటం ఉత్తమం. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి.

Updated Date - 2023-06-10T11:20:29+05:30 IST