Yoga: ప్రసరిత పాదోత్తనాసనంతో ఎన్నో ప్రయోజనాలు!

ABN , First Publish Date - 2023-04-11T12:05:28+05:30 IST

యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఏ ఆసనంతో ఏ కండరాలకు వ్యాయామం అందుతుందో, ఎలాంటి ఫలం దక్కుతుందో మీకు తెలుసా?

Yoga: ప్రసరిత పాదోత్తనాసనంతో ఎన్నో ప్రయోజనాలు!
Yoga

యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఏ ఆసనంతో ఏ కండరాలకు వ్యాయామం అందుతుందో, ఎలాంటి ఫలం దక్కుతుందో మీకు తెలుసా?

ప్రసరిత పాదోత్తనాసనం: రెండు కాళ్లూ, రెండు చేతులూ నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే....

  • వెన్ను సాగుతుంది.

  • తొడలు, పిక్కలు, పిరుదుల్లోని కండరాలు బలపడతాయి.

  • మనసు నెమ్మదించి, ఒత్తిడి, ఆందోళన, గందరగోళం, తలనొప్పులు, భుజాల్లో నొప్పులు తగ్గుతాయి. ి

  • ఈ ఆసనంతో నాడీ వ్యవస్థ స్వాంతన పొందుతుంది.

  • మరింత క్లిష్టమైన యోగాసనాలను సాధన చేసేందుకు వీలుగా ఈ ఆసనం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

అధోముఖకపోత్తనాసనం: ఒక కాలును మడిచి, మరో కాలును వెనకగా చాపి కూర్చుని, శరీరాన్ని ముందుకు నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

  • వెనకకు వంగే ఆసనాలు వేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

  • తుంటి, తొడ ఎముకలు కలిసే కీలును బలపరుస్తుంది.

  • నడిచేటప్పుడు, పద్మాసనం వేసే సమయంలో, శరీరం మరింత తేలికగా కదిలేలా ఈ ఆసనం తోడ్పడుతుంది.

విపరీతకారణి: నేల మీద వెల్లకిలా పడుకుని, గోడ మీద కాళ్లు నిటారుగా చాపి ఉంచే ఈ ఆసనంతో ఒరిగే ప్రయోజనాలు ఇవి...

  • ఈ ఆసనం వేసే సమయంలో నడుము అడుగున దుప్పటి ఉండలా చుట్టి ఉంచుకుంటే, కాళ్ల వాపులు, అలసిపోయే కీళ్లు, భారంగా మారే తుంటి సమస్యలు తగ్గుతాయి.

  • ఈ ఆసనం వేయడం ద్వారా లింఫ్‌, ఇతర స్రావాలు ఆయా శరీర భాగాల నుంచి పొత్తికడుపులోకి చేరతాయి. ఫలితంగా కాళ్లు, పునరుత్పత్తి వ్యవస్థల్లోని ఇబ్బందులు తొలగుతాయి.

సేతుబంధాసనం: నేల మీద వెల్లకిలా పడుకుని, కాళ్లు మడిచి, పాదాలను రెండు చేతులతో పట్టుకుని నడుమును లేపి ఉంచే ఈ ఆసనంతో ఈ ప్రయోజనాలు కలుగుతాయి.

  • వెన్నులోని ఒత్తిడి తొలుగుతుంది.

  • వెన్ను, మెడ, ఛాతీలోని కండరాలు స్వాంతన పొందుతాయి.

  • వెన్ను కండరాలు బలపడతాయి.

  • వెన్నులో గూడుకట్టుకున్న ఒత్తిడి వదిలిపోతుంది.

Updated Date - 2023-04-11T12:05:28+05:30 IST