Earthquake: అఫ్గాన్‌లో 2 వేల 445కి చేరిన మృతుల సంఖ్య.. గుండెలవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబాలు
ABN , First Publish Date - 2023-10-09T10:19:44+05:30 IST
అఫ్గానిస్థాన్‌లో(Afghanistan) సంభవించిన భారీ భూకంపం (Earthquake) పెను విధ్వంసాన్నే సృష్టించింది. ఈ విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 వేల 445 మంది భూకంపం ధాటికి శిథిలాల్లో చిక్కుకుపోయి చనిపోయారని వెల్లడించారు.
కాబూల్: అఫ్గానిస్థాన్‌లో(Afghanistan) సంభవించిన భారీ భూకంపం (Earthquake) పెను విధ్వంసాన్నే సృష్టించింది. ఈ విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 వేల 445 మంది భూకంపం ధాటికి శిథిలాల్లో చిక్కుకుపోయి చనిపోయారని వెల్లడించారు. తాలిబన్ల(Taliban) దేశంలో ఇప్పుడంతా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ఏ శిథిలం కింద ఎన్ని శవాలు ఉన్నాయోననే భయం రెస్క్యూ సిబ్బందిలో ఉంది. దాదాపు 2 వేల మంది తీవ్రంగా గాయపడ్డారని వారు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.
పశ్చిమ అఫ్గాన్ లోని హెరాట్(Herat) లో శనివారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని తరువాత వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. ఈ ఘోర విపత్తులో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. రంగంలోకి దిగిన మిలటరీ(Military) దళాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. అదే టైంలో మరో భూకంపం రానుందనే వదంతులు వ్యాపించడంతో దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి చేరారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వరుస భూకంపాలు తాలిబన్ల రాజ్యాన్ని వణికిస్తున్నాయి. దీంతో ఆ దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ప్రపంచ దేశాల సాయం కోసం ఆర్థిస్తోంది.