Earthquake: అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం
ABN , First Publish Date - 2023-03-27T09:37:43+05:30 IST
అఫ్ఘానిస్థాన్ దేశంలో సోమవారం మళ్లీ భూకంపం సంభవించింది...
కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలో సోమవారం మళ్లీ భూకంపం సంభవించింది.(Afghanistan) అఫ్ఘాన్ దేశంలోని టాఖార్ ప్రావిన్సు పరిధిలోని ఫర్కార్ జిల్లాలో(Farkhar district) సంభవించిన భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. 124 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. అప్ఘాన్ పొరుగు దేశాల్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం వల్ల భారీ నష్టంతో పాటు వేలాదిమంది మరణించారు. అఫ్ఘానిస్థాన్ దేశంలో తరచూ భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవిస్తున్నాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అప్ఘాన్ అధికారులు చెప్పారు.