Share News

Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఎంతమంది చనిపోయారంటే..?

ABN , First Publish Date - 2023-10-16T13:37:39+05:30 IST

అఫ్గానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నాలుగో సారి భూకంపం సంభవించింది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు చనిపోయారు.

Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఎంతమంది చనిపోయారంటే..?

అఫ్గానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నాలుగో సారి భూకంపం సంభవించింది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు చనిపోయారు. వేల మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారుల సంఖ్యనే 90 శాతం ఉండడం గమనార్హం. అయితే ఈ నెల 7న భూకంపం వచ్చిన పశ్చిమ అఫ్గానిస్థాన్‌ హెరాట్ ప్రావిన్స్‌లోనే ఆదివారం మళ్లీ భూప్రకపంనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. తాజా భూకంపం హెరాత్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో, భూమికి 6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. వారం రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో 6.3 తీవ్రతతో వచ్చిన నాలుగో భూకంపం కావడం గమనార్హం. ఈ భూకంపంలో నలుగురు చనిపోగా 153 మంది గాయపడ్డారని సహాయక బృందం సేవ్ ది చిల్డ్రన్ తెలిపింది. భూకంపం ధాటికి రబత్ సంగీ జిల్లాలోని బలూచ్ ప్రాంతంలో విషాదకర ఛాయలు అలుముకున్నాయి. అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ భూకంపలో మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా అంతకుముందు సంభవించిన భూకంపాల వల్ల ప్రావిన్స్‌లో 2,000 మందికి పైగా మరణించారని తాలిబాన్ అధికారులు తెలిపారు

Updated Date - 2023-10-16T13:37:39+05:30 IST