TikTok: ఆస్ట్రేలియా సర్కారు సంచలన నిర్ణయం...టిక్ టాక్‌పై నిషేధాస్త్రం
ABN , First Publish Date - 2023-04-04T12:47:49+05:30 IST
ఆస్ట్రేలియా దేశం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది....
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా దేశం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది.ఆస్ట్రేలియన్ ఫెడరల్ ప్రభుత్వం భద్రత భయంతో ప్రభుత్వ పరికరాల్లో వీడియో షేరింగ్ అప్లికేషన్ టిక్‌టాక్‌ను నిషేధించింది.(Australia to ban TikTok) చైనా దేశీయుల జోక్యానికి తెర వేయాలని ఆస్ట్రేలియా టిక్ టాక్ యాప్ ను నిషేధించింది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్ టిక్ టాక్ ను నిషేధిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. అనంతరం తాజాగా ఆస్ట్రేలియా టిక్ టాక్ ను నిషేధించిన 5వదేశంగా నిలిచింది.(government devices)టిక్ టాక్ పై నిషేధాస్త్రం అత్యంత త్వరగా అమలులోకి వస్తుందని ఆస్ట్రేలియా అటార్నీ-జనరల్ మార్క్ డ్రేఫస్ చెప్పారు.