బ్రిటన్ వీసా ఫీజు పెంపు.. నేటి నుంచే అమలు
ABN , First Publish Date - 2023-10-04T03:36:21+05:30 IST
బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన వీసా ఫీజు పెంపు బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
లండన్, అక్టోబరు 3: బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన వీసా ఫీజు పెంపు బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ఆరు నెలలలోపు కాలానికి పర్యాటక వీసా ఫీజు 15 పౌండ్లు(సుమారు రూ.1500) పెరగనుండగా, విద్యార్థి వీసా ఫీజు 127 పౌండ్లు(సుమారు రూ.12,700) పెరగనుంది. ఆరు నెలలలోపు కాలానికి పర్యాటక వీసా ఫీజు ఇప్పటి వరకు 100 పౌండ్లు(సుమారు రూ.10,000) వసూలు చేస్తుండగా, ఇప్పుడు అది 115 పౌండ్లు(సుమారు రూ.11,500) కానుంది. అలాగే, విద్యార్థి వీసా ఫీజు ఇప్పటి వరకు 363 పౌండ్లు(సుమారు రూ.36,443) ఉండేది. ఇప్పుడు అది 490 పౌండ్లు(సుమారు రూ.49,193) కానుంది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ జూలైలోనే వీసా ఫీజు పెంపు ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా, ఆ బిల్లును గతనెలలో బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు.