Justine Trudeau: భారత్ విషయంలో సీరియస్‌గానే ఉంటాం: జస్టిన్ ట్రూడో
ABN , First Publish Date - 2023-09-29T10:58:05+05:30 IST
భారత్ విషయంలో తాము, తమ మిత్ర దేశాలు సీరియస్ గానే ఉంటాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudeau) స్పష్టం చేశారు. శుక్రవారం మాంట్రియల్ లో ఆయన మీడియతో మాట్లాడుతూ.. ఖలిస్థానీ(Khalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యలో భారత్(India) ప్రమేయం ఉన్నప్పటికీ తాము ఆ దేశంతో సన్నిహిత సంబంధాలే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కెనడా: భారత్ విషయంలో తాము, తమ మిత్ర దేశాలు సీరియస్ గానే ఉంటాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudeau) స్పష్టం చేశారు. శుక్రవారం మాంట్రియల్ లో ఆయన మీడియతో మాట్లాడుతూ.. ఖలిస్థానీ(Khalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యలో భారత్(India) ప్రమేయం ఉన్నప్పటికీ తాము ఆ దేశంతో సన్నిహిత సంబంధాలే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం, గతేడాది ఇరు దేశాల మధ్య ఇండో, పసిఫిక్ ఉమ్మడి వ్యూహాం రూపొందింది.
అదే టైంలో బాధ్యతాయుత దేశంగా ఉగ్రవాది హత్యలో నిజానిజాలు కనుక్కోవడానికి ఇండియా తమతో కలిసి పని చేయాలి. అప్పటివరకు కెనడా, మా మిత్ర దేశాలు భారత్ విషయంలో సీరియస్ గానే ఉంటాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం లేదనేలా చేసిన వ్యాఖ్యలను అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ లేవనెత్తుతారని ఆ దేశం హామీ ఇచ్చింది. కెనడా(Canada) గడ్డపై భారత ప్రభుత్వ ఏజెంట్లు మా పౌరుడిని హత్య చేశారనే ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని దేశాలు ఖండించాలి' అని ఆయన అన్నారు. ట్రూడో ఆరోపణల తరువాత ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు చెలరేగాయి.