Home » Canada
భారత్పై కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్న కెనడా ఇప్పుడు ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై పడింది.
కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల హత్యపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
తాత్కాలిక పర్మిట్లపై కెనడాలో ఉంటున్న లక్షలాది మంది భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
కెనడా కథనంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటలకే జస్టిన్ ట్రుడో ప్రభుత్వం స్పందించింది. మీడియా కథనం తమ ప్రభుత్వ స్పందన కాదని తెలిపింది. కేవల ఊహాగానాలు, తప్పుడు సమాచారంతో ఉన్న కథనమని పేర్కొంది. కెనడాలో సీరియస్ క్రిమినల్ కార్యకలాపాల్లో ప్రధాని మోదీ, జైశంకర్, దోవల్ ప్రమేయం ఉన్నట్టు తామెప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చింది.
తానొక్కడే ఐదు వందల మందికి పైగా భారతీయులను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా కెనడా సరిహద్దులను దాటించి అమెరికాకు చేరవేశానని రాజిందర్సింగ్ అనే మానవ స్మగ్లర్ అమెరికా పోలీసుల ఎదుట అంగీకరించాడు.
ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్దీప్ డల్లాను కెనడాలోని హాల్టన్ రీజనల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
కెటీఎఫ్ చీఫ్ హర్దీప్ నిజ్జర్ గత ఏడాది కెనడాలో హత్యకు గురికావడం, ఈ ఘటనలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్కు సన్నిహితుడైన డల్లాకు భారతదేశంలో పలు క్రిమినల్ కేసులతో సంబంధాలు ఉన్నాయని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ప్రధానంగా వలసల విషయంలో అమెరికా పక్కదేశమైన కెనడా కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులకు ట్రూడో ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
హింసాత్మక నేరాలతో భారత దౌత్యవేత్తలకు లింక్ ఉందనే అనుమానాలకు తావిచ్చే ఒక మెమో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2023 ఏప్రిల్ తేదీతో ఉన్న ఈ మెమోను మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా జారీ చేసినట్టుగా ఉంది.