India Canada Row: నిజ్జర్ హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం స్పష్టంగా ఉంది.. కెనడా పేల్చిన మరో బాంబ్
ABN , First Publish Date - 2023-09-27T16:03:57+05:30 IST
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశం.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ వివాదం ముదురుతున్న తరుణంలో..
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశం.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ వివాదం ముదురుతున్న తరుణంలో.. కెనడాలోని అధికారి పార్టీకి మిత్రపక్షమైన న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) నాయకుడు జగ్మీత్ సింగ్ మరో బాంబ్ పేల్చాడు. నిజ్జర్ హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన సూచన ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘కెనడా ప్రధాని ట్రూడో బహిరంగంగా చెప్పినట్టు.. కెనడా పౌరుడు కెనడియన్ గడ్డపై చంపబడ్డాడని, ఈ హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఉందని ‘కెనిడియన్ ఇంటెలిజెన్స్’ ఉంది’’ అని పేర్కొన్నారు.
అలాగే.. భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని జగ్మీత్ తెలిపారు. అయితే.. తనకు అందిన ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఆధారంగానే ట్రూడో తన అభిప్రాయాల్ని పంచుకున్నారని సమర్థించారు. కెనడాకు మునుపెన్నడూ లేని ఇంటెలిజెన్స్ అందిందని.. అందుకే కెనడియన్ ప్రభుత్వం నిజ్జర్ హత్య కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, బాధ్యులను ముందుకు తీసుకురావాలని తాము కోరుతున్నామన్నారు. ఈ కేసు విషయంలో భారతదేశం నుండి పారదర్శకత కోసం కెనడా ఇచ్చిన పిలుపుకు యునైటెడ్ స్టేట్స్ చాలా మద్దతు ఇస్తోందన్నారు. ఈ విషయంలో తాము ఒత్తిడి చేస్తూనే ఉంటామన్నారు. మాజీ గవర్నర్-జనరల్ డేవిడ్ జాన్సన్ తయారుచేసిన మెటీరియల్‌లపై తాను బ్రీఫింగ్‌ను అందుకున్నానని. కాగా.. ఈ కేసుని పరిష్కరించేందుకు గాను జాన్సన్‌ని ప్రత్యేకంగా నియమించారు. అయితే.. ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
జాన్సన్ నివేదికలో తాను డాక్యుమెంట్స్‌ని చూశానని, కచ్ఛితమైన బహిరంగ విచారణ అవసరమని ఆ నివేదిక ధృవీకరించిందని జగ్మీత్ సింగ్ పేర్కొన్నారు. డాక్యుమెంట్స్ చదివిన తర్వాత.. ఈ ఘటనపై వెంటనే ప్రధాని, ప్రధానమంత్రి కార్యాలయం చర్యలు తీసుకోని లోపాన్ని ఎత్తి చూపిందన్నారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా ప్రధాని తన చర్యల్లో ఆవశ్యకతని ప్రదర్శించలేదని మండిపడ్డారు. కెనడాలో సిక్కులను లక్ష్యంగా చేసుకుంటారనే భయం ఉందని ఆయన అన్నారు. భారత ప్రభుత్వ చర్యల్ని బట్టి చూస్తే.. సిక్కుల సమాజానికి చెందిన సభ్యులు చాలా కాలంగా టార్గెట్‌గా ఉన్నారని తెలుస్తోందన్నారు. దీనిని ఎవరూ గుర్తించలేదన్నారు. కెనడా గడ్డపై విదేశీ ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదిని చంపడంతో.. ఆ భయం నిజమేనని స్పష్టమైందని చెప్పుకొచ్చారు. ఇతర కమ్యూనిటీకి చెందిన వాళ్లు సైతం భారత విధానాలపై విమర్శలు గుప్పించారని జగ్మీత్ సింగ్ వెల్లడించారు.