China:కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు ఔట్.. చైనా ప్రభుత్వ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-10-25T11:00:16+05:30 IST
చైనా(China) అర్ధాంతరంగా పలువురు మంత్రుల్ని తప్పించడం సంచలనం సృష్టిస్తోంది. ఆ మధ్య రక్షణ మంత్రిని తొలగించిన చైనా.. తాజాగా.. ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రులకు(Cabinet Ministers) కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది.
బీజింగ్: చైనా(China) అర్ధాంతరంగా పలువురు మంత్రుల్ని తప్పించడం సంచలనం సృష్టిస్తోంది. ఆ మధ్య రక్షణ మంత్రిని తొలగించిన చైనా.. తాజాగా.. ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రులకు(Cabinet Ministers) కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పలువురు సీనియర్లను పక్కన పెట్టారు. చైనా ఆర్థిక మంత్రి లియు కున్ (ఎల్), సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్ (ఆర్) లను ఎలాంటి కారణాలు లేకుండా క్యాబినెట్ నుంచి షీ జిన్ పింగ్(Xi Jin Ping) ప్రభుత్వం తప్పించింది. మంత్రి లియు కున్‌ను తొలగించి, అతని స్థానంలో లాన్ ఫోయాన్‌ను నియమించినట్లు అంతర్జాతీయ మీడియా ఛానళ్లు తెలిపాయి.
లాన్ కి మంత్రి పదవి వరించక ముందే, సెప్టెంబర్ చివరిలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చీఫ్‌గా ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్‌ను తొలగించి, ఆయన స్థానంలో యిన్ హెజున్‌ను నియమించినట్లు మరో అధికారిక ప్రకటన వెలువడింది. వాంగ్‌ను ఎందుకు తొలగించారో తెలియలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వాంగ్ జిగాంగ్‌ను తొలగించి, అతని స్థానంలో యిన్ హెజున్‌ను నియమించినట్లు మరో అధికారిక ప్రకటన తెలిపింది. వాంగ్‌ను తన పదవి నుంచి ఎందుకు తొలగించారో తెలియరాలేదు. వాంగ్ 2012 జులై నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ మినిస్టర్‌గా పనిచేశారు. 2018లో అదే శాఖ మంత్రి అయ్యారు. ఎలాంటి కారణాలు చూపకుండానే చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫును కూడా చైనా రెండు నెలల కిందట తీసేసింది. అప్పటి నుంచి ఆ పదవి భర్తీ చేయలేదు. మార్చిలో జరిగిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లీ, ఆగస్టు 29న చివరిసారిగా ప్రసంగించారు. ఆ రోజు నుంచి ఎక్కడా కనిపించడం లేదు. చైనా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.