Share News

Vivo Money Laundering: మా సంస్థల పట్ల వివక్ష సరికాదు.. భారత్‌పై డ్రాగన్ కంట్రీ బుస్ బుస్

ABN , Publish Date - Dec 25 , 2023 | 04:59 PM

‘వివో’ మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి భారతదేశంపై డ్రాగన్ కంట్రీ చైనా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. చైనా కంపెనీల పట్ల వివక్ష చూపవద్దని భారత్‌ను గట్టిగానే కోరిన చైనా.. తాము ఈ విషయాన్ని నిశితంగా...

Vivo Money Laundering: మా సంస్థల పట్ల వివక్ష సరికాదు.. భారత్‌పై డ్రాగన్ కంట్రీ బుస్ బుస్

Vivo Money Laundering: ‘వివో’ మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి భారతదేశంపై డ్రాగన్ కంట్రీ చైనా సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. చైనా కంపెనీల పట్ల వివక్ష చూపవద్దని భారత్‌ను గట్టిగానే కోరిన చైనా.. తాము ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ వివో మనీలాండరింగ్ విషయాన్ని మేము నిశితంగా పరిశీలిస్తున్నాము. చైనా ప్రభుత్వం వారి చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా కంపెనీలకు దృఢంగా మద్దతు ఇస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల అరెస్టు చేసిన వివోకు చెందిన ఇద్దరు చైనా ఉద్యోగులకు బీజింగ్ కాన్సులర్ రక్షణ & సహాయం అందించనుంది.


ఇదిలావుండగా.. గతేడాది జులైలో వివో-ఇండియా, దానితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. అప్పుడు చైనా జాతీయులు, మల్టిపుల్ ఇండియన్ కంపెనీలతో కూడిన ఒక పెద్ద మనీలాండరింగ్ రాకెట్‌ని ఛేధించినట్టు పేర్కొంది. భారతదేశంలో పన్నులు చెల్లించకుండా ఉండేందుకు గాను.. వివో-ఇండియా చైనాకు చట్టవిరుద్ధంగా రూ.62,476 కోట్లను బదిలీ చేసిందని ED ఆరోపించింది. ఈ కేసులో ఈడీ డిసెంబర్ 23వ తేదీన వివో-ఇండియా ఎగ్జిక్యూటివ్స్ అయిన తాత్కాలిక CEO హాంగ్ జుక్వాన్ అలియాస్ టెర్రీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హరీందర్ దహియా, కన్సల్టెంట్ హేమంత్ ముంజాల్‌ను అరెస్ట్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

అంతకుముందు కూడా ఈడీ ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకుంది. ‘లావా’ ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓం రాయ్, చైనా జాతీయుడు గ్వాంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్స్ నితిన్ గార్గ్, రాజన్ మాలిక్‌లను అరెస్ట్ చేసింది. వీళ్లు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంలో కోర్టుకు సమర్పించిన పత్రాల్లో.. ‘వివో-ఇండియా’ ద్వారా వాళ్లు లాభాలు పొందేందుకు గాను భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వానికి హాని కలిగించే రీతిలో కార్యకలాపాలకు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. ఈ కేసు సంచలనంగా మారడం.. తమ జాతీయుల్లో ఇద్దరు అరెస్ట్ కావడంతో.. చైనా పైవిధంగా ఘాటుగా స్పందించింది.

Updated Date - Dec 25 , 2023 | 05:42 PM