Covid 19: కరోనాతో మాటలు కోల్పోయిన బాలిక.. అప్రమత్తంగా ఉండాలంటూ మసాచుసెట్స్ వైద్యుల హెచ్చరిక
ABN , Publish Date - Dec 21 , 2023 | 11:07 AM
కరోనాతో 15 ఏళ్ల బాలిక మాటలు కోల్పోవడం అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధితురాలు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్( Massachusetts General Hospital)లోని అత్యవసర విభాగంలో చేరింది.
న్యూయార్క్: కరోనాతో 15 ఏళ్ల బాలిక మాటలు కోల్పోవడం అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధితురాలు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్( Massachusetts General Hospital)లోని అత్యవసర విభాగంలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు గొంతు సంబంధిత పక్షవాతం వచ్చినట్లు గుర్తించామన్నారు.
ఆపరేషన్ చేసి గొంతులో గొట్టం అమర్చి శ్వాస తీసుకునేలా చేశామని తెలిపారు. ఆమెకు ఈ పరిస్థితి 13 నెలలపాటు కొనసాగిందని వివరించారు. అయితే కరోనాకు(Corona) కారణమైన సార్స్ కోవ్ - 2(SARSCov - 2) వైరస్ నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇది సంకేతమని వైద్యులు హెచ్చరించారు. కరోనా సోకిన వ్యక్తి స్వరాన్ని కోల్పోవడం ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు.
కొవిడ్ సోకి తగ్గినా దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయని అన్నారు. తాజాగా కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తున్నందునా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇలా ఏ సమస్య ఉన్నా వైద్యుల్ని సంప్రదించాలని చెబుతున్నారు.
"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"