Italy: గగనతలంలో ఫ్లైట్‌కు రంధ్రం.. హడలెత్తిపోయిన ప్యాసింజర్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-07-26T14:49:24+05:30 IST

గగనతలంలో ఓ పెద్ద విమానం ఒడిదుడుకులకు గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆకాశంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, వడగండ్లతో ఆకాశం దద్దరిల్లింది. పెద్ద ఎత్తున వడగండ్లు విమానానికి తగలడంతో తీవ్రంగా దెబ్బతింది. విమానం ముక్కు, రెక్కలు ధ్వంసమయ్యాయి. దీంతో

Italy: గగనతలంలో ఫ్లైట్‌కు రంధ్రం.. హడలెత్తిపోయిన ప్యాసింజర్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

గగనతలంలో ఓ పెద్ద విమానం ఒడిదుడుకులకు గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆకాశంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, వడగండ్లతో ఆకాశం దద్దరిల్లింది. పెద్ద ఎత్తున వడగండ్లు విమానానికి తగలడంతో తీవ్రంగా దెబ్బతింది. విమానం ముక్కు, రెక్కలు ధ్వంసమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఫైలెట్ వెంటనే ల్యాండింగ్ చేశాడు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఇటలీలోని మిలన్‌‌లో చోటుచేసుకుంది.

డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 185 నంబర్‌ విమానం 215 మంది ప్రయాణికులతో ఇటలీలోని (Italy) మిలన్‌ నుంచి అమెరికా (USA)లోని న్యూయార్క్‌(New York) జేకేఎఫ్‌ ఎయిర్‌‌పోర్టుకు బయల్దేరింది. టేకాఫ్ అయ్యే సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉంది. కానీ ప్రయాణం సాగుతుండగా 15 నిమిషాల తర్వాత తీవ్రమైన వడగళ్లు, పిడుగులతో వర్షం కురవడంతో విమానం ఇబ్బందులకు గురైంది. ఫ్లైట్‌ను నియంత్రించడం పైలట్లకు ఇబ్బందికరంగా మారడంతో వెంటనే విమానాన్ని అత్యవసరంగా రోమ్‌లో ల్యాండింగ్‌ చేశారు. విమానంలో 215 మంది ప్రయాణికులు, 8 మంది సహాయక సిబ్బంది, ముగ్గురు పైలట్లు ఉన్నారు.

flite.jpg

ఈ సంఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి స్పందించారు. మిలన్‌ నుంచి న్యూయార్క్‌ బయల్దేరిన డెల్టా ఫ్లైట్‌ వాతావరణం కారణంగా రోమ్‌లో ల్యాండ్‌ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం విమానం స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దెబ్బతిన్న విమాన ఫొటోలను ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాల్లో విమానం ముక్కు పూర్తిగా ధ్వంసమైనట్లు ఉంది. అలాగే రెండు ఇంజిన్లు, రెక్కలు కూడా వడగళ్ల కారణంగా దెబ్బతిన్నాయి.

ప్రయాణికుల భయాందోళన..

వడగళ్ల వర్షంలో చిక్కుకొన్నాక విమానం ఒక్కసారిగా అదుపు తప్పిందని ప్రయాణికులు వెల్లడించారు. ఒక దశలో విమానం ముక్కలైపోతుందేమోనని తాము భయపడ్డామని ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-07-26T14:49:24+05:30 IST