Kim Jong un Russia Tour: కిమ్‌కి రష్యా ఇచ్చిన బహుమతులివే!
ABN , First Publish Date - 2023-09-17T16:21:24+05:30 IST
ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్(Kim Jong un) కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. నియంతలా పాలిస్తున్న ఆయన కొవిడ్ విజృంభణ తగ్గిన తరువాత తొలి సారి విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా కొన్ని రోజులుగా రష్యా(Russia)లో పర్యటిస్తున్నారు.
ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్(Kim Jong un) కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. నియంతలా పాలిస్తున్న ఆయన కొవిడ్ విజృంభణ తగ్గిన తరువాత తొలి సారి విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా కొన్ని రోజులుగా రష్యా(Russia)లో పర్యటిస్తున్నారు. రష్యా పర్యటన ముగించుకున్న అనంతరం ఆయనకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) విలువైన బహుమతులు అందించారు. ఆ దేశ గవర్నర్ కిమ్ కి 5 పేలుడు డ్రోన్లు, 1 నిఘా డ్రోన్, బుల్లెట్ ప్రూఫ్ షర్ట్(Bullet Proof Shirt)ను గిఫ్టులుగా అందించారు. ఇవి కిమ్ రక్షణను మరింత పెంచనున్నాయి.
అయితే రష్యాతో ఆయన ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారనే వార్త చాలా దేశాలను భయపెట్టింది. శనివారం కిమ్ రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్ సోనిక్ క్షిపణులు, యుద్ధ నౌకలను పరశీలించారు. ఆదివారం వ్లాడివోస్టాక్‌లో చదువుతున్న ఉత్తర కొరియా విద్యార్థులతో కిమ్ సమావేశమయ్యారు. రష్యా, నార్త్ కొరియాల నడుమ స్నేహ పూరిత వాతావరణంలో చర్చలు జరిగాయని, పలు ఆయుధాల కొనుగోలుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.